IND vs NZ | హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్ అద్భుత పోరాటం..! కివీస్ స్కోరు 243/5
IND vs NZ | న్యూజిలాండ్ - భారత్(India) తొలి టెస్టు మ్యాచ్(Test match) లో న్యూజిలాండ్(New Zealand) అద్భుత పోరాట పటిమ కనబరిచింది. న్యూజిలాండ్ ఆదిలోనే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
IND vs NZ | న్యూజిలాండ్ – భారత్(India) తొలి టెస్టు మ్యాచ్(Test match) లో న్యూజిలాండ్(New Zealand) అద్భుత పోరాట పటిమ కనబరిచింది. న్యూజిలాండ్ ఆదిలోనే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కానీ, హెన్రీ నికోల్స్(Henry Nicholls), గ్లెన్ ఫిలిప్స్ జట్టును ముందుండి నడిపించారు. ఈ క్రమంలో నికోల్స్ సెంచరీ చేయగా.. ఫిలిప్స్ సెంచరీకి చేరువయ్యాడు. తొలి రోజు ఆట ముగిసేసరికి నికోల్స్ (221 )బంతులు ఎదుర్కొని 14 ఫోర్ల సాయంతో (113) పరుగులు.. ఫిలిప్స్ (182) బంతుల్లో 13 ఫోర్లు బాది (94) పరుగులతో అజేయంగా నిలిచారు. ఇద్దరూ కలిసి ఆరో వికెట్‌కు అబేధ్యంగా( 173 ) పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో కివీస్ తిరిగి పుంజుకుంది. ఫలితంగా తొలి రోజు ఆట ముగిసే సరికి న్యూజిలాండ్ ఐదు వికెట్ల నష్టానికి (243/5) పరుగులు చేయగలిగింది.
అంతకుముందు టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఆది నుంచే భారత పేసర్లు చెలరేగారు. ఓపెనర్లలో కెప్టెన్ టామ్ లాథమ్‌ను జస్ప్రీత్ బుమ్రా డకౌట్ చేయగా.. డెవాన్ కాన్వేను నాలుగు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అన్షుల్ కాంబోజ్ పెవిలియన్‌కు పంపాడు. వన్‌డౌన్‌లో వచ్చిన రచిన్ రవీంద్ర (15) వికెట్‌ను ఆకాశ్ దీప్ తన ఖాతాలో వేసుకోగా.. డారిల్ మిచెల్ (1) రూపంలో మరో కీలక వికెట్‌ను బుమ్రా దక్కించుకున్నాడు. వికెట్ కీపర్ బ్యాటర్ టామ్ బ్లండెల్ (5) కూడా వెనక్కి పంపాడు. ఫలితంగా ఉదయం సెషన్లో న్యూజిలాండ్ కేవలం 70 పరుగులు చేసి ఏకంగా ఐదు వికెట్లు కోల్పోయింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వన్‌డౌన్ బ్యాటర్ హెన్రీ నికోల్స్, ఆల్‌రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ కలిసి అద్భుత రీతిలో పోరాడారు. భారత బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా 3.. అన్షుల్ కాంబోజ్, ఆకాశ్ దీప్ చెరో వికెట్ తీశారు.

Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్ అద్భుత పోరాటం..! కివీస్ స్కోరు 243/5
KCR | తెలంగాణ ఒక నిఖార్సయిన ఉద్యమకారున్ని కోల్పోయింది : కేసీఆర్
Bandla Ganesh | బండ్ల గణేశ్‌కు జైలుశిక్ష.. రూ. 95 లక్షల చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు కోర్టు కీలక తీర్పు
Tyson Naidu Teaser | మాస్ యాక్షన్ విందుతో బెల్లంకొండ ‘టైసన్ నాయుడు’ టీజర్.!
Siddipeta | పోలీసుల దిగ్బంధనంలో సిద్దిపేట.. ఎక్కడికక్కడే బీఆర్ఎస్ నాయకుల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

