Ramayana | ‘రామాయణ’ ట్రైలర్‌పై ప్రశంసలు.. కానీ వ్యూస్ మాత్రం ఆశించిన స్థాయిలో లేవా?
Ramayana | బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ శ్రీరాముడి పాత్రలో నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘రామాయణ’పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ మైథాలజికల్ విజువల్ స్పెక్టాకిల్‌లో సాయి పల్లవి, సన్నీ డియోల్, రవి దుబే, యశ్ తదితర ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Ramayana | బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ శ్రీరాముడి పాత్రలో నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘రామాయణ’పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ మైథాలజికల్ విజువల్ స్పెక్టాకిల్‌లో సాయి పల్లవి, సన్నీ డియోల్, రవి దుబే, యశ్ తదితర ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే సినీ అభిమానుల దృష్టిని ఆకర్షించింది.ఇటీవల విడుదలైన ‘రామాయణ’ ట్రైలర్ ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను అందుకుంది. విజువల్ ఎఫెక్ట్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాత్రల లుక్స్, సినిమాటిక్ ప్రెజెంటేషన్‌కు ప్రశంసలు లభిస్తున్నాయి. ముఖ్యంగా తొలి గ్లింప్స్‌తో పోలిస్తే ట్రైలర్‌పై మరింత పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ రావడం చిత్ర బృందానికి ఊరటనిచ్చిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
అయితే ట్రైలర్‌పై ప్రశంసల వర్షం కురిపించినప్పటికీ, ట్రైలర్‌కు వచ్చిన వ్యూ కౌంట్ మాత్రం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. సాధారణంగా భారీ పాన్ ఇండియా చిత్రాల ట్రైలర్లు విడుదలైన తొలి 24 గంటల్లోనే వందల మిలియన్ల వ్యూస్ నమోదు చేస్తుంటాయి. ఆ స్థాయిలో ‘రామాయణ’ ట్రైలర్‌కు వ్యూస్ కనిపించకపోవడం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇదే సందర్భంగా కొందరు నెటిజన్లు ‘ఆదిపురుష్’ ట్రైలర్‌ను ఉదాహరణగా ప్రస్తావిస్తున్నారు. ఆ చిత్ర ట్రైలర్ విడుదలైన తొలి 24 గంటల్లో హిందీ వెర్షన్‌కే భారీ స్థాయిలో వ్యూస్ నమోదయ్యాయని గుర్తు చేస్తున్నారు. దీంతో ‘రామాయణ’ ట్రైలర్‌కు ఎందుకు అదే స్థాయి సంఖ్యలు కనిపించడం లేదనే ప్రశ్నలు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి.
అయితే వ్యూస్ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ప్రేక్షకులు ట్రైలర్‌కు ఆర్గానిక్ రెస్పాన్స్ మాత్రమే చూపుతున్నారని, వ్యూస్ కంటే ప్రేక్షకుల నుంచి వస్తున్న పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ ముఖ్యమని అంటున్నారు. మరోవైపు మరికొందరు మాత్రం అధికారిక వ్యూ కౌంట్ ఆశించిన స్థాయిలో లేకపోవడంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. సినీ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఒక ట్రైలర్ విజయాన్ని కేవలం వ్యూస్ ఆధారంగా నిర్ణయించడం సరైంది కాదు. ప్రేక్షకుల స్పందన, సోషల్ మీడియాలో చర్చ, థియేట్రికల్ ఓపెనింగ్స్ వంటి అంశాలే సినిమా విజయాన్ని నిర్ణయిస్తాయి. ప్రస్తుతం ‘రామాయణ’పై ఉన్న అంచనాలు ఏమాత్రం తగ్గలేదు. ఇక విడుదలకు ముందు చిత్ర బృందం విడుదల చేసే తదుపరి ప్రమోషనల్ కంటెంట్, పాటలు, టీజర్లు ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన అందుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

