Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Manchu Manoj | విభిన్న కథలు, పవర్ఫుల్ పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న హీరో మంచు మనోజ్ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
Manchu Manoj | విభిన్న కథలు, పవర్ఫుల్ పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న హీరో మంచు మనోజ్ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, పోతరాజు నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ బిగ్ బడ్జెట్ చిత్రాన్ని ‘డివైన్ యాక్షన్ థ్రిల్లర్’గా రూపొందిస్తున్నారు. ‘ప్రేమకథా చిత్రం’, ‘జక్కన్న’ వంటి విజయవంతమైన చిత్రాల నిర్మాతలు R. P. అక్షిత్ రెడ్డి, R. సుదర్శన్ రెడ్డి RPA క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నం. 4గా ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ వద్ద కో-డైరెక్టర్‌గా పనిచేసిన ఏ. శ్రీధర్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. దర్శకుడు ఈ సినిమా కోసం అత్యంత శక్తివంతమైన కథను సిద్ధం చేశారని, మంచు మనోజ్‌ను ఇప్పటివరకు ఎన్నడూ చూడని సరికొత్త అవతార్‌లో ఈ చిత్రంలో చూపించబోతున్నారని చిత్రబృందం తెలిపింది. పోతరాజు నేపథ్యంలో దైవిక అంశాలు, ఉత్కంఠభరితమైన కథనం, భారీ యాక్షన్ సన్నివేశాల సమ్మేళనంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తెలంగాణ పండుగల వైభవం, సంప్రదాయాల నేపథ్యంతో రూపొందనున్న ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని అందించనుంది.
ఈ చిత్రానికి ఆర్. ఆయుష్ రెడ్డి కో-ప్రొడ్యూసర్‌గా, ఎం. శ్రీకాంత్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తుండగా, తేజస్వి సజ్జా పీఆర్వోగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు మరియు షూటింగ్ తదితర వివరాలను మేకర్స్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

