Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
SonOfKanakadurgamma | దసరా పండుగ సందర్భంగా ప్రముఖ నిర్మాతలు అశ్వనీదత్, స్వప్న దత్ చేతుల మీదుగా ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ కనిపించే పవర్ఫుల్ పోస్టర్‌ను విడుదల చేశారు.
దసరా పండుగ సందర్భంగా ప్రముఖ నిర్మాతలు అశ్వనీదత్, స్వప్న దత్ చేతుల మీదుగా ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ కనిపించే పవర్ఫుల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌ను ఆవిష్కరించిన అనంతరం చిత్రబృందానికి నిర్మాతలు తమ శుభాకాంక్షలు తెలిపారు. యాక్షన్, అడ్వెంచర్ జానర్లో సరికొత్త కథతో రాగా మూవీస్ & తిలోత్తమ ప్రొడక్షన్స్ బ్యానర్లపై వాణి శంకర్, తిలోత్తమ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ చిత్రానికి దుర్గ ఫణిదర్ లంక దర్శకత్వం వహిస్తుండగా, కాకర్ల గోవర్దనరావు కథను అందించారు. ఇందులో లయ, అనురూప్ కటారి, ఆకాంక్ష త్యాగరాజన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. నిధి అన్వేషణ (ట్రెజర్ హంట్) అనే వినూత్న కాన్సెప్ట్ మీద ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులోని కథ, కథనాలు, విజువల్స్, యాక్షన్ సన్నివేశాలు అన్నీ సినిమాకు ప్రధాన హైలైట్‌గా నిలవనున్నాయి. అమ్మవారిగా లయ కనిపించే సన్నివేశాలు ప్రేక్షకులకు రోమాలు నిక్కబొడుచుకునేలా అద్భుతమైన అనుభూతిని ఇస్తాయని చిత్రబృందం చెబుతోంది. ఈ చిత్రానికి శశిధర్ లంక సంగీతం అందిస్తుండగా, సామ్ కే ప్రసన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సమకూరుస్తున్నారు. ప్రసాద్ కేవీ కెమెరామెన్‌గా, రాజేష్ లంక యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. రాఘవేందర్ రెడ్డి ఎడిటర్‌గా, చైతన్య మీనవల్లి మరియు ప్రసాద్ కేవీ డైలాగ్ రైటర్లుగా వర్క్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని అప్డేట్లను చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించనుంది.

Whatsapp Image 2026 10 20 At 7.25.28 Pm
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

