Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Jagadish Reddy | విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని సూర్యాపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముస్లిం, క్రైస్తవ సోదరులకు సామూహిక విందు ఏర్పాటు చేశారు.
Jagadish Reddy | విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని సూర్యాపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముస్లిం, క్రైస్తవ సోదరులకు సామూహిక విందు ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ మతాలకు చెందిన ప్రతినిధులు, మత పెద్దలు పాల్గొన్నారు. జగదీష్ రెడ్డి వారిని ఆత్మీయంగా ఆహ్వానించి, వారితో కలిసి విందులో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. సర్వమతాల సారాంశం మానవత్వమేనని అన్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఉద్యమ సమయంలోనే ప్రజల మధ్య ఐక్యతను చాటిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్ని మతాల ప్రధాన పండుగలకు ప్రత్యేక నిధులు కేటాయించారని తెలిపారు. క్రిస్మస్ ప్రేమవిందు, రంజాన్ ఇఫ్తార్ విందు, తోఫా, దుస్తుల పంపిణీ వంటి కార్యక్రమాలు అన్ని మతాల పట్ల కేసీఆర్‌కు ఉన్న గౌరవానికి నిదర్శనమని పేర్కొన్నారు.

Suryapet Dussehra1
సూర్యాపేటలో ప్రజల మధ్య ఉన్న మతసామరస్యం, ఐక్యత ప్రశంసనీయమని జగదీష్ రెడ్డి అన్నారు. ఎన్ని ప్రయత్నాలు జరిగినా ప్రజల మధ్య ఐక్యత చెక్కుచెదరకుండా ఉందని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో అందరూ కలిసి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మత పెద్దలు సూర్యాపేట అభివృద్ధి, ప్రశాంత వాతావరణం, ప్రజల మధ్య ఐక్యతను ప్రస్తావిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమి పండుగను జరుపుకుంటామని జగదీష్ రెడ్డి అన్నారు. ఈ పర్వదినం ప్రజల జీవితాల్లో సంతోషం, శాంతి, ఐక్యతను తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రజలందరికీ మరోసారి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.

Suryapet Dussehra2
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

