టెంట్ బ్రిడ్జ్ : ఇంగ్లండ్-పాకిస్తాన్ మధ్య రెండో టీ 20 మ్యాచ్ జరుగుతోంది. ఇంగ్లిష్ బ్యాట్స్‌మెన్ లివింగ్‌స్టోన్ తన శక్తినంతా కూడదీసుకుని బంతిని బ్యాట్‌తో బాదాడు. అంతే అమాంతం స్టేడియం దాటి పక్కనే ఉన్న రగ్బీ పిచ్‌పై పడింది. ఇంతకీ ఆ సిక్స్ ఎంత పొడవాటిదంటే.. 125 కు పైగా మీటర్లంట. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ పాకిస్తాన్‌పై 45 పరుగుల తేడాతో విజయం సాధించింది. మూడు టీ 20 మ్యాచ్‌ల సిరీస్‌లో చెరో మ్యాచ్ గెలిచి 1-1 తో ఇంగ్లండ్-పాకిస్తాన్ సమంగా ఉన్నాయి.
రెండో టీ 20 లో ఇంగ్లండ్ జట్టు నిర్ణీత ఓవర్లలో 201 పరుగుల లక్ష్యాన్ని పాకిస్తాన్ ముందుంచింది. అయితే, పాకిస్తాన్ 9 వికెట్లు కోల్పోయి కేవలం 155 పరుగులే చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టులోని లివింగ్‌స్టోన్ 23 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సులతో 38 పరుగులు సాధించాడు. ఈ సిక్సుల్లో ఒకటి అత్యంత ఎత్తుగా వెళ్లి స్టేడియం దాటి పక్కనే ఉన్న రగ్బీ పిచ్‌పై పడింది. 16 వ ఓవర్లో పాక్ బౌలర్ హరీస్ రవూఫ్ వేసిన బాల్‌ను లాంగాన్ మీదుగా గట్టిగా బాదడంతో అది సిక్స్‌గా స్టేడియం దాటింది. ఈ సిక్స్‌ను ప్రపంచంలోనే అత్యంత పొడవైన సిక్స్‌గా కామెంట్రేటర్స్తోపాటు సోషల్ మీడియా యూజర్స్ పేర్కొంటున్నారు. 125 + మీటర్ల కంటే ఎక్కువ పొడవుగా ఈ సిక్స్ ఉన్నదని నిపుణులు తేల్చారు. అయితే, ఈ సిక్స్ యొక్క అధికారిక పొడవును కొలవడం మాత్రం సాధ్యం కాలేదంట. ఇలాంటి సిక్స్‌ను ఇంతవరకు తాము చూడలేదని స్కై స్పోర్ట్స్‌లో కామెంట్రేటర్లుగా ఉన్న ఇయాన్ వార్డ్, కుమార సంగక్కర మ్యాచ్ అనంతరం చెప్పారు.
ఐసీసీ అధికారిక గణాంకాల ప్రకారం పొడవైన సిక్స్ ఆస్ట్రేలియాకు చెందిన బ్రెట్‌లీ పేరిట ఉన్నది. 2005 లో 130-135 మీటర్ల పొడవుతో సిక్స్ బాది రికార్డుల్లో స్థానం పొందారు. 2012 లో న్యూజిలాండ్‌కు చెందిన మార్టిన్ గుప్తిల్ 120-125 మీటర్ల పొడవైన సిక్స్ నమోదు చేశారు. కాగా, అనధికారికంగా 1899 లో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌కు చెందిన అల్బర్ట్ ట్రాట్ 160 మీటర్లు, 2013 లో పాకిస్తాన్‌కు చెందిన షాహిద్ ఆఫ్రిదీ 158 మీటర్ల పొడవుతో సిక్స్‌లు బాదారు.
ఈ వ్యాయామం రోజూ చేస్తే రోగాల నుంచి దూరంగా ఉండొచ్చు.. ఏంటది?
అమెరికన్ నేవీలో మహిళా శకం ఆరంభం
ఈసారి సెంట్రల్ వర్సిటీల్లో నేరుగా ప్రవేశాలు
ఒక్క వన్డే.. 10 రికార్డులు.. అవేంటంటే..!
పాకిస్తాన్లో ఘోర రోడ్డు ప్రమాదం, 30 మంది మృతి
చరిత్రలో ఈరోజు.. 14 బ్యాంకులను జాతీయం చేసిన ఇందిరాగాంధీ
సిద్ధివినాయకుడికి 2 కోట్లతో గుడి కట్టిన క్రిస్టియన్..! ఎందుకంటే..?
త్వరలో స్పేస్ మసాలా..! కావాలంటే వీరిని సంప్రదించాలి..
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..