Stock Market Close | దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు దేశీయ మార్కెట్లకు ఊతమిస్తున్నాయి. దీంతో మార్కెట్లు పరుగులు తీస్తున్నాయి. కిత్రం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ 73,957.57 పాయింట్ల వద్ద లాభంతో మొదలైంది. ఆ తర్వాత కొద్దిసేపటి సెన్సెక్స్ 74వేల పాయింట్ల ఎగువన ట్రేడయ్యింది. చివరి సెషన్లో మదుపరులు లాభాల స్వీకరణకు దిగడంతో స్వల్పంగా పతనమైంది. ఆ తర్వాతో కోలుకుంది.
ఇంట్రాడేలో 73,788.61 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసిన సెన్సెక్స్.. 74,121.61 పాయింట్ల గరిష్ఠాన్ని తాకింది. చివరకు 114.48 పాయింట్ల లాభంతో 73,852.94 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 34.40 పాయింట్లు పెరిగి 22,402.40 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, పవర్ గ్రిడ్, కోటక్ మహీంద్రా బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎన్టీపీసీ, ఎల్అండ్టీ, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్ లాభపడ్డాయి. టీసీఎస్, టెక్ మహీంద్రా, మారుతీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, టైటాన్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, ఎంఅండ్ఎం నష్టాల్లో ముగిశాయి.