మెక్సికో మాజీ అధ్యక్షులపై ఆగస్టు 1 న రెఫరెండం
అవినీతి ఆరోపణలపై ఐదుగురు మెక్సికో మాజీ అధ్యక్షులను విచారించాలా? వద్దా? అనే దానిపై రెఫరెండం నిర్వహిస్తున్నారు. మెక్సికో ఓటర్లు ఇచ్చే తీర్పు మేరకు ఐదుగురు మాజీ అధ్యక్షులపై అవినీతి ఆరోపణలను విచారించేందుకు ప్రస్తుత ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.

మెక్సికో : అవినీతి ఆరోపణలపై ఐదుగురు మెక్సికో మాజీ అధ్యక్షులను విచారించాలా? వద్దా? అనే దానిపై రెఫరెండం నిర్వహిస్తున్నారు. మెక్సికో ఓటర్లు ఇచ్చే తీర్పు మేరకు ఐదుగురు మాజీ అధ్యక్షులపై అవినీతి ఆరోపణలను విచారించేందుకు ప్రస్తుత ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ రెఫరెండంను వచ్చే నెల 1 న నిర్వహించేందుకు ఉత్తర అమెరికా దేశమైన మెక్సికో ఆ దేశ కోర్టు నుంచి అనుమతి పొందింది. దీనిని రాజ్యాంగాన్ని ఎగతాళిగా పేర్కొంటూ.. కేసు నమోదు చేయాలా? వద్దా? అనే విషయాన్ని నిర్ణయించేది ప్రాసిక్యూషన్ కానీ, ప్రజలు కాదని ప్రతిపక్షాలు అంటున్నాయి.
మాజీ అధ్యక్షులపై విచారణ జరిపేందుకు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని మెక్సికో ప్రస్తుత అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యువల్ లోపెజ్ ఒబ్రాడోర్ నిర్ణయించారు. ‘అవినీతికి పాల్పడిన మాజీ అధ్యక్షులపై విచారణ కొనసాగాలా? వద్దా? అనే విషయాన్ని ప్రజలు నిర్ణయించనివ్వండి. దేశంలో గత 30 సంవత్సరాలుగా అవినీతి ప్రభుత్వాలు ఉన్నాయి. మోసాలు, డ్రగ్స్ వాడకాన్ని నివారించడంలో గత ప్రభుత్వాలు విఫలమయ్యాయి. ఫలితంగా దేశంలో హింస ఘోరంగా పెరిగింది. ఈ ప్రభుత్వాల చర్యలను బహిర్గతం చేయడానినే నేను ప్రెసిడెంట్ అయ్యాను’ అని ఒబ్రాడోర్ పేర్కొన్నారు.
2018 లో భారీ విజయం సాధించి ఒబ్రాడోర్ మెక్సికో అధ్యక్షుడయ్యాడు. అప్పటి నుంచి మాజీ అధ్యక్షులను విచారించేందుకు రెఫరెండం నిర్వహించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రజాభిప్రాయ సేకరణను వచ్చే ఎన్నికల పరీక్షగా కూడా పరిగణిస్తున్నారు. దీనితో తనకు ఎంత ప్రజల మద్దతు ఉన్నదో కూడా ఒబ్రాడోర్ తెలుసుకోవాలనుకుంటున్నట్లుగా తెలుస్తున్నది. ఇప్పటికే మెక్సికో నగరంలో సగం నిర్మించిన విమానాశ్రయం ప్రాజెక్టును ఒబ్రాడోర్ రద్దు చేశారు.
ఈ రెఫరెండం నిర్వహణకు 9 నెలల క్రితం 2020 అక్టోబర్ నెలలో ఆ దేశ సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. మాజీ అధ్యక్షులు కార్లోస్ గోర్టారి (1988-1994), ఎర్నెస్టో జెడిల్లో (1994–2000), విసెంటే ఫాక్స్ (2000–2006), ఫెలిపే కాల్డెరోన్ (2006–2012), ఎన్రిక్ పీ నీటో (2012–2018) లపై రెఫరెండం నిర్వహించనున్నారు. దోషులుగా తేలితే మాజీ అధ్యక్షులపై అధికారులు చర్యలు తీసుకోగలరా లేదా అనేది వేచి చూడాల్సిందే.
ఇవి కూడా చదవండి..
సిద్ధమైన 3 డీ ప్రింటెడ్ స్టీల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..?
నటి కరీనా కపూర్ పుస్తకం ‘ప్రెగ్నెన్సీ బైబిల్’పై ఫిర్యాదు
చరిత్రలో ఈరోజు.. విభజించు పాలించు ప్రారంభం
England Vs Pakistan | సిక్స్ కొడితే.. దద్దరిల్లిపోయింది..!
ఈ వ్యాయామం రోజూ చేస్తే రోగాల నుంచి దూరంగా ఉండొచ్చు.. ఏంటది?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

