woman raped, duped | మహిళపై అత్యాచారానికి పాల్పడి.. రూ.14 లక్షలకు పైగా మోసగించిన వ్యక్తి
woman raped, duped | మ్యాట్రిమోనియల్ సైట్లో పరిచయమైన వ్యక్తి ఒక మహిళను రూ.14 లక్షలకుపైగా మోసగించాడు. ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధిత మహిళ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ముంబై: మ్యాట్రిమోనియల్ సైట్లో పరిచయమైన వ్యక్తి ఒక మహిళను రూ.14 లక్షలకుపైగా మోసగించాడు. ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధిత మహిళ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (woman raped, duped) మహారాష్ట్రలోని నాగపూర్‌లో ఈ సంఘటన జరిగింది. 31 ఏళ్ల మహిళకు మ్యాట్రిమోనియల్ సైట్లో 36 ఏళ్ల రాఘవేంద్ర కిషోర్ అవస్థి పరిచయమయ్యాడు. అతడి భార్య జీవించి ఉన్నప్పటికీ చనిపోయిందని అబద్ధం చెప్పాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆ మహిళపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.
కాగా, జిమ్ వ్యాపారాన్ని ప్రారంభించేందుకు పెట్టుబడి పేరుతో ఆ మహిళను రాఘవేంద్ర డబ్బులు డిమాండ్ చేశాడు. రూ.14.8 లక్షలు తీసుకుని ఆమెను మోసగించాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాఘవేంద్ర తనను మానసికంగా వేధించాడని, శారీరకంగా దాడి చేశాడని ఆరోపించింది. నిందితుడి కుటుంబ సభ్యుల్లో కొందరు కూడా ఈ కుట్రలో అతడికి సహకరించారని ఫిర్యాదులో పేర్కొంది. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- duped
- MAN
- matrimonial site
- met
RELATED ARTICLES
తాజా వార్తలు
US-Iran | అమెరికన్ల హత్యకు ఇరాన్ కుట్ర.. మిడిల్ ఈస్ట్‌లో యూస్ రాయబార సిబ్బందికి హై అలర్ట్
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
అంజనాపురంలో పట్టపగలే భారీ చోరీ
Emergency Alert | యూకేలో ఎమర్జెన్సీ అలర్ట్.. మూడు రోజులకు సరుకులు ఉంచుకోవాలన్న సర్కారు..!
‘రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలి’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

