e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, July 30, 2021
Home News రాజ్‌కుంద్రా ‘క్యూ’ చెప్పింది ఇక్కడే..?

రాజ్‌కుంద్రా ‘క్యూ’ చెప్పింది ఇక్కడే..?

రాజ్‌కుంద్రా ‘క్యూ’ చెప్పింది ఇక్కడే..?

ముంబై : అశ్లీల చిత్రాల నిర్మాణం కేసులో అరెస్టయిన బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా అరెస్ట్ తర్వాత అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కుంద్రాను అరెస్ట్ చేయడానికి ముందు ముంబై క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు 5 నెలల పాటు తీవ్రంగా శ్రమించి పక్కా ఆధారాలు సేకరించి మరీ కేసు నమోదు చేసినట్లు తెలుస్తున్నది. రోజుకు రూ.20 వేల చొప్పున ఒక బంగ్లాను అద్దెకు తీసుకుని అశ్లీల చిత్రాల చిత్రీకరణ జరిపేవారని, 20,25 ఏండ్లుగా సినిమా ఫీల్డ్‌లో కష్టపడుతున్న పలువురు బాధితులుగా ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలినట్లు సమాచారం. తనను టార్గెట్ చేసి కాంట్రాక్ట్ సినిమాల్లో పనిచేయమని బలవంతం చేసేవారని ఒక నటి పోలీసుల ఎదుట వెల్లడించినట్లు సమాచారం. 2021 ఫిబ్రవరి 4 వ తేదీన రాజ్‌ కుంద్రాపై కేసు నమోదైంది. అయితే, పోలీసులకు కుంద్రాపై స్టేట్‌మెంట్‌ మినహా మరేమీ లేకపోవడంతో అప్పుడు అతడ్ని అరెస్ట్ చేయలేదు.

మూడు రోజుల క్రితం మలాడ్ వెస్ట్‌లోని మాడ్ గ్రామంలో అద్దె బంగ్లాపై దాడి చేసిన పోలీసులు.. అక్కడి నుంచి బలమైన ఆధారాలు సేకరించిన తర్వాతనే రాజ్‌కుంద్రాను అరెస్టు చేశారు. రాజ్‌కుంద్రాపై అశ్లీల చిత్రాలు తీయడం, యాప్‌ల ద్వారా సబ్‌స్క్రైబర్లకు ప్రసారం చేయడం, షేర్‌ చేయడం వంటి ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో క్రైమ్ బ్రాంచ్ బృందం ఐపీసీలోని 292, 293, 420, 34, ఐటీ చట్టంలోని 67, 67 ఏ, ఐపీసీ సెక్షన్ 420 నమోదు చేశారు. ఇప్పటివరకు 5 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. కుంద్రా కార్యాలయం నుంచి పలు బ్యాంక్‌ అకౌంట్లు, మొబైల్‌ ఫోన్లు, అశ్లీల క్లిప్‌లను గుర్తించారు. ఈ కేసులో ఇప్పటివరకు ఐదుగురు వ్యక్తులను అరెస్ట్‌ చేసిన క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు రూ.7.5 కోట్ల నగదును సీజ్‌ చేశారు.

ఇదే ఇంట్లోనే షూటింగ్‌..

- Advertisement -

మలాడ్‌ వెస్ట్‌లోని మాడ్‌ గ్రామంలోని ఒక పురాతన బంగ్లాను అశ్లీల సినిమాల నిర్మాణానికి వేదికగా ఎంచుకున్నారు. ఈ బంగ్లాకు రోజుకు రూ. 20 వేల చొప్పున అద్దె చెల్లించేవారు.
భోజ్‌పురి, మరాఠీ చిత్రాల షూటింగ్ పేరిట తన నుంచి బంగ్లాను అద్దెకు తీసుకున్నట్లు ఇంటి యజమాని పోలీసులకు తెలిపారు. షూటింగ్ సమయంలో బంగ్లా యజమాని, ఇతర సిబ్బందిని ఇంట్లోకి రానిచ్చేవారు కాదని పోలీసులు తెలిపారు. షూటింగ్ ప్రారంభమయ్యే ముందు బంగ్లాను అన్ని వైపుల నుండి నీలిరంగు తెరతో కప్పేవారని పోలీసులు గుర్తించారు.

రాజ్‌కుంద్రా సినిమా నిర్మాణానికి ఉద్దేశించిన ప్రొడక్షన్ హౌస్ ముసుగులో పోర్న్ ఫిల్మ్ రాకెట్‌ను నడుపుతున్నట్లు తెలిసింది. అతడి సినిమాల్లో పనిచేసే అమ్మాయిలు, అబ్బాయిలలో ఎక్కువ మంది ఆర్థికంగా కష్టపడుతున్నారు. వారు 20 నుండి 25 సంవత్సరాల కళాకారులను ఎంచుకుని పనికానిచ్చేవారు. షూటింగ్‌కు ముందు తమ ఇష్టానుసారంగా నటిస్తున్నట్లు వారితో ఒప్పందంపై సంతకం తీసుకునేవాడని పోలీసులు తెలిపారు. ఒక్కొక్కరికి రోజుకు రూ.30 నుంచి 50 వేల వరకు ఇచ్చేవాడని పోలీసులు చెప్తున్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి..

చరిత్రలో ఈ రోజు.. 138 ఏండ్ల క్రితం థియేటర్‌ ప్రారంభం

ఆకాశంలో బర్త్‌డే, పెండ్లి రోజు ఫంక్షన్లు..! ఎక్కడంటే?

ఇంట్లో ఫోన్‌ మర్చిపోయారా..? డోంట్‌వర్రీ కారు ఉందిగా..!

సిద్ధమైన 3 డీ ప్రింటెడ్‌ స్టీల్‌ బ్రిడ్జ్‌.. ఎక్కడో తెలుసా..?

ఈ వ్యాయామం రోజూ చేస్తే రోగాల నుంచి దూరంగా ఉండొచ్చు.. ఏంటది?

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
రాజ్‌కుంద్రా ‘క్యూ’ చెప్పింది ఇక్కడే..?
రాజ్‌కుంద్రా ‘క్యూ’ చెప్పింది ఇక్కడే..?
రాజ్‌కుంద్రా ‘క్యూ’ చెప్పింది ఇక్కడే..?

ట్రెండింగ్‌

Advertisement