చరిత్రలో ఈ రోజు.. 138 ఏండ్ల క్రితం థియేటర్ ప్రారంభం
భారతదేశంలో తొలి థియేటర్ ‘ది స్టార్’ ను కోల్‌కతాలో 138 ఏండ్ల క్రితం 1883 లో సరిగ్గా ఇదే రోజున ప్రారంభించారు. కథ అందించడమే కాకుండా ప్రధాన పాత్రలో గిరీష్ చంద్ర ఘోష నటించిన ‘దక్ష యజ్ఞ’ నాటకాన్ని ప్రదర్శించారు.

భారతదేశంలో తొలి థియేటర్ ‘ది స్టార్’ ను కోల్‌కతాలో 138 ఏండ్ల క్రితం 1883 లో సరిగ్గా ఇదే రోజున ప్రారంభించారు. కథ అందించడమే కాకుండా ప్రధాన పాత్రలో గిరీష్ చంద్ర ఘోష నటించిన ‘దక్ష యజ్ఞ’ నాటకాన్ని ప్రదర్శించారు.
ఈ థియేటర్‌ను బినోదిని దాసి, అమృతల్ బసు, మరికొందరితో కలిసి గిరీష్ చంద్ర ఘోష్ నిర్మించారు. తొలుత ఈ థియేటర్‌కు బినోదిని అనే పేరు పెట్టారు. అయితే, ఈ రంగంలో మహిళలు ఉండటం అవమానకరంగా భావించినందున థియేటర్ పేరును ‘ది స్టార్’ గా మార్చారు. ఈ థియేటర్ నిర్మించేందుకు గురుముఖ్ రాయ్ ఆర్థిక సహకారం అందించారు. అనంతరం గిరీష్ చంద్ర తదితరులకు రూ.11 వేలకు అమ్మారు. 1883 నుంచి 1887 వరకు ఈ థియేటర్లో దాదాపు 20 సినిమాలను ప్రదర్శించారు.
ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో 1888 లో ప్రస్తుతం ఉన్న బిధాన్ సరాని ప్రాంతానికి ఈ థియేటర్‌ను మార్చారు. ఈ థియేటర్లో ప్రదర్శించిన ఎన్నో నాటకాలు, సినిమాలు ద్వారా లెక్కకు మిక్కిలి కళాకారులు ప్రసిద్ధి పొందారు. 1898 లో స్వామి వివేకానంద ఈ థియేటర్లో మార్గరెట్ నోబెల్ (సిస్టర్ నివేదా) ను పరిచయం చేయడానికి బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ పరమహంస, రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా హాజరయ్యారు. భారతదేశంలో సినిమాలు ప్రారంభమైన తర్వాత హిరలాల్ సేన్ చేసిన చిత్రాన్ని కూడా ఈ థియేటర్లో ప్రదర్శించారు. విమర్శకులతో కూడా మన్ననలు అందుకున్న మన్మత్ రాయ్ నాటకం ‘జైలు’ 1931 లో ప్రదర్శించారు. ప్రస్తుతం దీనిని సినిమా హాల్‌గా మార్చారు. అప్పుడప్పుడు నాటకాలు కూడా ప్రదర్శిస్తున్నారు.
మరికొన్ని ముఖ్య సంఘటనలు..
2007: హ్యారీ పొటర్ సిరీస్‌లోని చివరి పుస్తకం ‘హ్యారీ పొటర్ అండ్ ది డెత్లీ హాలోస్’ విడుదల
2011: భూమికి తిరిగి వచ్చిన నాసా యొక్క అట్లాంటిస్ నౌక
1983: రష్యాలోని వోస్టాక్ స్టేషన్ వద్ద మైనస్ 89.2 ° C కి చేరుకున్న ఉష్ణోగ్రత
1977: భారత రాష్ట్రపతిగా నీలం సంజీవ రెడ్డి ఎన్నిక
1988: ఇండియన్ నేషనల్ శాటిలైట్ (ఇన్సాట్ -1సీ) ప్రయోగం
1960: ప్రపంచంలో మొదటి మహిళా ప్రధానమంత్రిగా సిరమావో బండార్ నాయకే ఎన్నిక
1930: హిందీ చిత్రాల ప్రసిద్ధ రచయిత, గేయ రచయిత ఆనంద్ బక్షి జననం
1884: లార్డ్స్ మైదానంలో ఆడిన మొదటి టెస్ట్
ఇవి కూడా చదవండి..
ఆకాశంలో బర్త్‌డే, పెండ్లి రోజు ఫంక్షన్లు..! ఎక్కడంటే?
ఇంట్లో ఫోన్ మర్చిపోయారా..? డోంట్‌వర్రీ కారు ఉందిగా..!
సిద్ధమైన 3 డీ ప్రింటెడ్ స్టీల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..?
ఈ వ్యాయామం రోజూ చేస్తే రోగాల నుంచి దూరంగా ఉండొచ్చు.. ఏంటది?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

