ఆకాశంలో బర్త్‌డే, పెండ్లి రోజు ఫంక్షన్లు..! ఎక్కడంటే?
ఫ్లోరిడాకు చెందిన ఓ సంస్థ మరో అడుగు ముందుకేసి, మనం చేసే ఫంక్షన్లు జీవితాంతం గుర్తుండిపోయేలా ఆకాశంలో ఏర్పాటు చేస్తానంటున్నది.

పెండ్లి రోజులు, బర్త్‌డే ఫంక్షన్లు చేసుకునేందుకు ఇప్పుడు ఎన్నో రిసార్టులు అందుబాటులో ఉన్నాయి. మనం కోరుకున్న రీతిలో ఉత్సవాలను జరుపుకునేందుకు సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఎల్లకాలం గుర్తుండిపోయేలా ఫంక్షన్లు చేసుకునేందుకు ఇప్పుడు చాలా మంది డబ్బులు ఖర్చు చేసేందుకు వెనకాడటం లేదు. బర్త్‌డేలు, కొత్త బట్టలు ధరించడం వంటి ఫంక్షన్లకు కూడా లక్షలు ఖర్చుపెడుతున్నారు. అయితే, ఫ్లోరిడాకు చెందిన ఓ సంస్థ మరో అడుగు ముందుకేసి, మనం చేసే ఫంక్షన్లు జీవితాంతం గుర్తుండిపోయేలా ఆకాశంలో ఏర్పాటు చేస్తానంటున్నది.
ఫ్లోరిడాకు చెందిన స్పేస్ పర్స్పెక్టివ్ అనే సంస్థ తమ బెలూన్‌లో ఆకాశంలో లక్ష ఫీట్ల ఎత్తుకు తీసుకెళ్లి మన ఫంక్షన్లను గ్రాండ్‌గా చేసుకునేందుకు ప్లాన్ సిద్ధం చేసింది. స్టేడియం సైజంత ఉండే బెలూన్ను స్పేస్ పర్స్పెక్టివ్ సంస్థ సిద్ధం చేసింది. ఇటీవలనే నాసాకు చెందిన కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించి చూశారు. ఈ బెలూన్‌కు నెప్ట్యూన్ అని పేరు పెట్టారు. ఈ బెలూన్‌లో ఒక్కసారి ఎనిమిది మంది ప్రయాణించే వీలుంటుంది. ఆరు గంటలపాటు ప్రయాణం ఉంటుంది. లాంచ్ ప్యాడ్ నుంచి బెలూన్ ఆకాశంలోకి ఎగురుతుంది. రెండు గంటల్లో 30 కిలోమీటర్ల ఎత్తుకు (దాదాపు లక్ష ఫీట్లు) వెళ్తుంది. నిర్ణీత సమయం ముగియగానే భూమిపైకి దిగడం ప్రారంభమవుతుంది. లాంచ్ ప్యాడ్ సమీపంలోని సముద్రంలో బెలూన్ సురక్షితంగా దిగుతుంది. ప్రయాణికులను పడవ సాయంతో ఒడ్డుకు చేర్చుతారు. ఈ స్పేస్ బెలూన్ 2024 నుంచి ఆకాశంలోకి ఎగిరేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.
గత నెల చివరి వారం నుంచి బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. 2024 వరకు బుకింగ్‌లు పూర్తయ్యాయి. ఇప్పుడు కంపెనీ వెబ్సైట్ ద్వారా 2025 ఏడాదికి బుకింగ్‌లు చేసుకోవచ్చునని సంస్థ తెలిపింది. తమ బెలూన్‌లో ప్రయాణించడానికి ఎలాంటి భయం అక్కర్లేదని సంస్థ అభయం ఇస్తున్నది. యూరప్ పైన చక్కర్లు కొట్టేందుకు ఈ బెలూన్‌లో ఎలాంటి ప్రత్యేక డ్రెస్ ధరించాల్సిన అవసరం లేదని కూడా వెల్లడించింది. విమానంలో కూర్చుని ప్రయాణించవచ్చునని సంస్థ తెలిపింది. కార్పొరేట్ ఈవెంట్స్, సెలబ్రేషన్స్ కోసం కూడా తమ బెలూన్ను బుక్ చేసుకోవచ్చునని సదరు సంస్థ పేర్కొన్నది. ఒక్కో ట్రిప్‌కు రూ.93 లక్షల ధర నిర్ణయించినట్లుగా తెలుస్తున్నది.
ఇవి కూడా చదవండి..
ఇంట్లో ఫోన్ మర్చిపోయారా..? డోంట్‌వర్రీ కారు ఉందిగా..!
భారత్‌తో సంబంధాలు కోరుకుంటున్నాం: నేపాల్ ప్రధాని డ్యూబా
మెక్సికో మాజీ అధ్యక్షులపై ఆగస్టు 1 న రెఫరెండం
సిద్ధమైన 3 డీ ప్రింటెడ్ స్టీల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..?
నటి కరీనా కపూర్ పుస్తకం ‘ప్రెగ్నెన్సీ బైబిల్’పై ఫిర్యాదు
చరిత్రలో ఈరోజు.. విభజించు పాలించు ప్రారంభం
ఈ వ్యాయామం రోజూ చేస్తే రోగాల నుంచి దూరంగా ఉండొచ్చు.. ఏంటది?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

