ఉట్నూర్, ఏప్రిల్ 25 : ఉట్నూర్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఆ పార్టీ ఖానాపూర్ ఇన్చార్జి జాన్సన్ నాయక్ స్థానిక ఐబీ చౌరస్తాలో గురువారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కును గెలుపించుకుందామన్నారు. ఇందుకోసం ప్రతి కార్యకర్త కష్టపడాలన్నారు.
తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని గడప గడపకూ తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ బాలాజీ, జడ్పీటీసీ చారులత, మండల శాఖ అధ్యక్షుడు కందుకూరి రమేశ్, నాయకులు పుష్పరాణి, ధరణి రాజేశ్, సింగారే భరత్, సలిం, సోఫియాన్, సోనేరావు, దావుల రమేశ్, రాజ్‌కుమార్, కార్యకర్తలు పాల్గొన్నారు.