Earthquake | ఢిల్లీలో భారీ భూకంపం.. 6.1 తీవ్రతతో కంపించిన భూమి
Earthquake | దేశ రాజధాని ఢిల్లీలో భారీ భూకంపం (Earthquake) సంభవించింది. గురువారం మధ్యాహ్నం సమయంలో రాజధాని నగరంతోపాటు సమీప ప్రాంతాల్లో భూ ప్రకంపనలు నమోదయ్యాయి.
Earthquake | దేశ రాజధాని ఢిల్లీలో భారీ భూకంపం (Earthquake) సంభవించింది. గురువారం మధ్యాహ్నం సమయంలో రాజధాని నగరంతోపాటు సమీప ప్రాంతాల్లో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 6.1గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. ఆఫ్ఘనిస్థాన్లో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది.
Earthquake of magnitude 6.1 on Richter scale hits Afghanistan, tremors felt in North India pic.twitter.com/P3wHPxnVYg
— ANI (@ANI) January 11, 2024
ఢిల్లీతోపాటు పంజాబ్, చండీగఢ్, జమ్మూకశ్మీర్ సహా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో సుమారు 30 సెకన్లపాటు భూమి కంపించింది. ఈ భూకంపం ధాటికి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు. మరోవైపు ఈ ప్రకంపనలతో ఇళ్లలోని ఫ్యాన్లు, ఇతర వస్తువులు ఊగిపోయాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలను స్థానికులు రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
పొరుగు దేశం పాకిస్థాన్లోనూ భూమి కంపించింది. లాహోర్, ఇస్లామాబాద్, ఖైబర్ ఫఖ్తుఖ్వా సహా పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు నమోదైనట్లు పాకిస్థాన్ జియో న్యూస్ వెల్లడించింది.
Tremors rock Lahore, Islamabad and Khyber Pakhtunkhwa cities: Pakistan’s Geo News
— ANI (@ANI) January 11, 2024
Also Read..
Mudragada | జనసేనలోకి ముద్రగడ..? ఆయన కుమారుడు ఏమన్నారంటే..!
fuel leak | పవర్ స్టేషన్ నుంచి భారీగా ఇంధనం లీక్.. మణిపూర్లో ఘటన
Bull Enters Bank | బ్యాంక్లోకి ప్రవేశించిన ఎద్దు.. వీడియో
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

