Bull Enters Bank | ఉత్తరప్రదేశ్ (UP) ఉన్నావ్ (Unnao)లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. దేశంలోనే ప్రధాన బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) బ్రాంచ్‌లోకి ఓ ఎద్దు (Bull) ప్రవేశించింది. బుల్‌ని చూసిన కస్టమర్లు, సిబ్బంది ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. నగరంలోని ఎస్బీఐ బ్రాంచ్‌లోకి ప్రవేశించిన ఎద్దు.. కాసేపు అలానే నిల్చుని గమనించింది. ఎద్దును చూసిన కస్టమర్లు, సిబ్బంది ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అది ఎక్కడ దాడి చేస్తుందోనన్న భయంతో దూరంగా వెళ్లారు. అంతలో సెక్యూరిటీ సిబ్బంది వచ్చి ఆ ఎద్దును బయటకు తరిమేశారు. దీంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎద్దు బ్యాంకులోకి ప్రవేశించిన ఘటనను అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
SBI bank to bull: Abhi Lunch Time Hai 😋pic.twitter.com/m6vtYgnyJP
— Kumar Manish (@kumarmanish9) January 10, 2024
Also Read..
Dense Fog | ఉత్తరాదిపై చలిపులి.. దట్టమైన పొగమంచు కారణంగా జీరోకు పడిపోయిన విజిబిలిటీ
YouTube India | అసభ్యకర వీడియోలు.. యూట్యూబ్ ఇండియాకు సమన్లు
Amazon Layoffs | అమెజాన్‌లో మళ్లీ లేఆఫ్స్ కలకలం.. వందలమందిపై వేటు..!