YouTube India | ప్రముఖ సోషల్ మీడియా సంస్థ యూట్యూబ్ ఇండియా (YouTube India)కు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (NCPCR) నోటీసులు జారీ చేసింది. యూట్యూబ్‌లో కొన్ని ఛానళ్లు తల్లులు, కుమారులకు సంబంధించి అసభ్యకర వీడియోలు (vulgar videos) పోస్టు చేస్తుండటంపై ఎన్సీపీసీఆర్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి వాటిపై యూట్యూబ్ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఈ మేరకు యూట్యూబ్ ఇండియాకు సమన్లు (Summons) అందజేసింది.
జనవరి 15న ఆయా ఛానళ్ల జాబితాతో యూట్యూబ్ ఇండియా ప్రతినిధి తమ ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. ఇలాంటి వీడియోలు చిన్నారుల భద్రత, శ్రేయస్సుకు హాని కలిగించే ప్రమాదం ఉందని కమిషన్ అభిప్రాయపడింది. ఈ మేరకు అసభ్యకర కంటెంట్‌ను తమ మాధ్యమం నుంచి తొలగించేందుకు ఎలాంటి మెకానిజం వినియోగిస్తున్నారో చెప్పాలని కోరింది.
Also Read..
Air Canada | షాకింగ్.. టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్న విమానంలోంచి దూకేసిన ప్రయాణికుడు
Aamir Khan | కూతురి పెళ్లిలో కన్నీళ్లు పెట్టుకున్న అమీర్ ఖాన్.. వీడియో వైరల్
Amazon Layoffs | అమెజాన్‌లో మళ్లీ లేఆఫ్స్ కలకలం.. వందలమందిపై వేటు..!