Aamir Khan | అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు ఇకపై మన ఇంట్లో ఉండదంటే ఏ తల్లిదండ్రులకైనా గుండె బరువెక్కుతుంది. 20 ఏళ్లుగా ఎంతో అపురూపంగా ఏ కష్టం రాకుండా చూసుకున్న కూతురికి పెళ్లి చేసి పంపించేటప్పుడు భావోద్వేగానికి గురవుతుంటారు. తాజాగా తన కుమార్తె పెళ్లిలో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ (Aamir Khan) కూడా కంటతడి పెట్టుకున్నారు.
అమీర్ ఖాన్ – రీనా దత్తా కుమార్తె ఐరా ఖాన్ (Ira Khan) వివాహం బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ప్రియుడు, ఫిట్నెస్ ట్రైనర్ నుపుర్ శిఖరే (Nupur Shikhare)ను ఐరా గత వారం ముంబైలోని ఓ హోటల్లో వివాహం చేసుకుంది. తాజాగా ఈ జంట రాజస్థాన్ ఉదయ్‌పూర్ (Udaipur)లో మరోసారి పెళ్లి చేసుకున్నారు. కుమార్తె పెళ్లి సందర్భంగా అమీర్ ఖాన్ భావోద్వేగానికి గురయ్యాడు. పెళ్లి తంతులో భాగంగా నూతన వధూవరులు ఉంగరాలు మార్చుకుంటున్న సమయంలో ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
కాగా, గత గురువారం ఐరా ఖాన్ – నుపుర్ శిఖరే వివాహం ముంబైలో కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ జంట రిజిస్టర్ మ్యారేజ్‌తో ఒక్కటయ్యారు. వివాహం అనంతరం అదే హోటల్లో రిసెప్షన్ కూడా నిర్వహించారు. ఈ వేడుకకు అమీర్‌ఖాన్, తన మాజీ భార్యలు రీనాదత్తా, కిరణ్‌రావుతో పాటు ముఖేశ్-నీతా అంబానీ దంపతులు తదితరులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. ఆ తర్వాత రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లో ఈ జంట తాజాగా మరోసారి వివాహం చేసుకుంది.
Also Read..
Sunil Gavaskar | టీ20 వరల్డ్‌కప్‌లో వికెట్‌కీపర్‌గా అతడే బెస్ట్ : గవాస్కర్
Atal Setu | ప్రారంభానికి సిద్ధమైన దేశంలో సముద్రంపై అతిపెద్ద బ్రిడ్జి.. వంతెనపైకి ఆ వాహనాలు నిషిద్ధం
Dinesh Karthik | ఇంగ్లండ్ కోచ్‌గా స్టార్ కామెంటేటర్.. తొలి సవాల్ భారత గడ్డపైనే