Atal Setu | ప్రారంభానికి సిద్ధమైన దేశంలో సముద్రంపై అతిపెద్ద బ్రిడ్జి.. వంతెనపైకి ఆ వాహనాలు నిషిద్ధం
దేశంలో అత్యంత పొడవైన, ఆధునిక సముద్రపు వంతెన ప్రారంభానికి సిద్ధమైంది. ముంబై-నవీముంబైని కలిపేలా నిర్మించిన ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ (MTHL) బ్రిడ్జిని ప్రధాని మోదీ ఈ నెల 12న జాతికి అంకితమివ్వనున్నారు.
ముంబై: దేశంలో అత్యంత పొడవైన, ఆధునిక సముద్రపు వంతెన ప్రారంభానికి సిద్ధమైంది. ముంబై-నవీముంబైని కలిపేలా నిర్మించిన ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ (MTHL) బ్రిడ్జిని ప్రధాని మోదీ ఈ నెల 12న జాతికి అంకితమివ్వనున్నారు. రూ.18 వేల కోట్లతో నిర్మించిన ఈ 22 కిలోమీటర్ల ఈ సముద్రపు వంతెనకు ‘అటల్ సేతు’ (Atal Setu) అని నామరకరణం చేశారు. అయితే దీనిపై ప్రయాణించడాన్ని ఆటోలు, మోటారు సైకిళ్లు, ట్రాక్టర్లకు అధికారులు నిషేధించారు. అదేవిధంగా జంతువులను రవాణా చేసే వాహనాలకు సైతం అనుమతి లేదని స్పష్టంచేశారు. ఇక ఈ బ్రిడ్జిపై గరిష్టంగా 100 కిలోమీటర్ల వెగంతో వాహనాలు వెళ్లవచ్చని అధికారులు తెలిపారు.

అటల్ సేతు ప్రారంభమైతే ముంబై నుంచి నవీ ముంబైకి ప్రయాణం చాలా సులభతరమవుతుంది. పాత కొత్త నగరాల మధ్య 20 నుంచి 25 నిమిషాల్లోనే రాకపోకలు సాగించవచ్చు. ఇది దక్షిణ ముంబైలోని శివడి నుంచి ప్రారంభమై, ఎలిఫెంటా ద్వీపానికి ఉత్తరాన ఉన్న థానే క్రీక్‌ను దాటుతుంది.

మొత్తం 22 కిలోమీటర్ల పొడవున్న ఈ బ్రిడ్జి సముద్రంపై 16.5 కిలోమీటర్లు, భూభాగంపై 5.5 కిలోమీటర్ల పొడవు ఉన్నది. ఇది ముంబై- పుణె ఎక్స్‌ప్రెస్ వేను, ముంబై-గోవా హైవేలను కలుపుతుంది. దీనిపై 400 సీసీటీవీ కెమెరాలను అమర్చారు. దేశంలోనే అత్యంత పొడవైన ఈ సముద్రపు వంతెనపై ఒకవైపు ప్రయాణించాలంటే రూ.250 చెల్లించాల్సిందే.


Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Atal Setu
- Bikes
- MTHL
- Mumbai Port
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

