Sunil Gavaskar | టీ20 వరల్డ్‌కప్‌లో వికెట్‌కీపర్‌గా అతడే బెస్ట్ : గవాస్కర్
Sunil Gavaskar : సొంతగడ్డపై వరల్డ్ కప్ చేజార్చుకున్న భారత జట్టు పొట్టి కప్(T20 World Cup)పై దృష్టి పెట్టింది. ఈ మెగా టోర్నీకి సన్నాహకాల్లో భాగంగా అఫ్గనిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు టీమిండియా సిద్ధమైంది. అయితే.. ఐసీసీ షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి వరల్డ్ కప్‌లో ఎవరిని ఏ ఆర్డర్లో ఆడించాలి? వికెట్ కీపర్‌గా ఎవరు? అనే చర్చలు...
Sunil Gavaskar : సొంతగడ్డపై వరల్డ్ కప్ చేజార్చుకున్న భారత జట్టు పొట్టి కప్(T20 World Cup)పై దృష్టి పెట్టింది. ఈ మెగా టోర్నీకి సన్నాహకాల్లో భాగంగా అఫ్గనిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు టీమిండియా సిద్ధమైంది. అయితే.. ఐసీసీ షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి వరల్డ్ కప్‌లో ఎవరిని ఏ ఆర్డర్లో ఆడించాలి? వికెట్ కీపర్‌గా ఎవరు? అనే చర్చలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో భారత దిగ్గజం సునీల్ గవాస్కర్(Sunil Gavaskar ) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మెగా టోర్నీలో వికెట్ కీపర్‌గా కేఎల్ రాహుల్‌కు బదులు డాషింగ్ బ్యాటర్ రిషభ్ పంత్‌ను తీసుకోవాలని అన్నాడు.
‘వికెట్ కీపర్‌గా రాహుల్ అద్భుతంగా రాణిస్తున్నాడు. కానీ టోర్నీ సమయానికి పంత్ ఫిట్‌గా ఉంటే అతడికే చాన్స్ ఇవ్వాలి. ఎందుకంటే.. ఫార్మాట్ ఏదైనా ఒంటిచేత్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగల సత్తా పంత్ సొంతం. ఒకవేళ నేనే సెలెక్టర్ అయితే రిషభ్ పంత్‌నే జట్టులోకి తీసుకుంటా’ అని లిటిల్ మాస్టర్ అభిప్రాయపడ్డాడు. అంతేకాదు టోర్నీ మొదలయ్యే నాటికి పంత్ రెడీగా లేకుంటే రాహుల్‌నే ఆడించాలని, అతడు జట్టుకు సమతూకం తెస్తాడని గవాస్కర్ తెలిపాడు.

‘పంత్ గైర్హాజరీలో రాహుల్ బెస్ట్ ఛాయిస్ అవుతాడు. ఎందుకంటే..? ఓపెనర్ నుంచి ఫినిషర్ వరకూ… ఏ స్థానంలోనైనా రాహుల్ బ్యాటింగ్ చేయగలడు. గతంలో అతడు 5, 6వ స్థానంలో అదరగొట్టాడు’ అని గవాస్కర్ వెల్లడించాడు. టీ20ల్లో రాహుల్‌కు మంచి రికార్డే ఉంది. 68 మ్యాచుల్లో అతడు 139.12 స్ట్రయిక్ రేటుతో 2,265 పరుగులు సాధించాడు.

దక్షిణాఫ్రికాతో సెంచూరియన్‌లో జరిగిన తొలి టెస్టులో టాపార్డర్ కుప్పకూలిన సమయంలో క్రీజులోకి వచ్చిన రాహుల్ సెంచరీతో చెలరేగాడు. బౌన్సర్లతో బెంబేలిత్తుస్తున్న సఫారీ పేస్ త్రయం రబడ, బర్గర్, జాన్సెన్లను దీటుగా ఎదుర్కొంటూ శతకంతో మెరిసి మరోసారి ఆపద్భాంధవుడు అనిపించుకున్నాడు.

అయితే.. అఫ్గనిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు సెలెక్టర్లు రాహుల్‌కు విశ్రాంనిచ్చారు. వికెట్ కీపర్లుగా జితేశ్ శర్మ, సంజూ శాంసన్‌లను ఎంపిక చేశారు. దాంతో, పొట్టి ప్రపంచకప్ ముందు చివరిదైన ఈ టీ20 సిరీస్‌లో రాహుల్‌ను ఆడిస్తే బాగుండేదని అభిమానులు చర్చించుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి
- Ananya Raj | కాటుక కన్నులతో కవ్విస్తున్న అనన్య రాజ్..
- Dinesh Karthik | ఇంగ్లండ్ కోచ్‌గా స్టార్ కామెంటేటర్.. తొలి సవాల్ భారత గడ్డపైనే
- Ganja | ఏపీ నుంచి బస్సుల్లో గంజాయి తరలిస్తున్న ఆరుగురు అరెస్టు
- Pension | పింఛన్ కోసం వృద్ధురాలి అగచాట్లు.. 2 కిలోమీటర్లు దేకుతూ
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

