Air Canada | కెనడాలోని టొరంటో విమానాశ్రయంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్న విమానంలో నుంచి ఓ ప్రయాణికుడు కిందకు దూకేశాడు. ఎయిర్ కెనడా (Air Canada) విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఎయిర్ కెనడాకు చెందిన ‘బోయింగ్ 747’ విమానం ఈనెల 8వ తేదీన కెనడాలోని టొరంటో విమానాశ్రయం (Toronto Pearson International Airport) నుంచి దుబాయ్ (Dubai) కు వెళ్లేందుకు రన్‌వేపై సిద్ధంగా ఉంది. ఆ సమయంలో ఓ ప్రయాణికుడు ఒక్కసారిగా క్యాబిన్ తలుపు తెరిచి కిందకు దూకేశాడు. ఈ హఠాత్తు పరిణామంతో ప్రయాణికులు, సిబ్బంది ఒక్కసారిగా షాక్ అయ్యారు. సుమారు 20 అడుగుల ఎత్తు నుంచి అతడు దూకడంతో తీవ్రంగా గాయపడినట్లు ఎయిర్ కెనడా తన అధికారిక వెబ్సైట్లో వెల్లడించింది. ఆ ప్రయాణికుడిని వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు తెలిపింది. మరోవైపు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనతో ఆ విమానం సుమారు ఆరు గంటలు ఆలస్యంగా దుబాయ్‌కు బయలుదేరి వెళ్లింది.
Also Read..
Aamir Khan | కూతురి పెళ్లిలో కన్నీళ్లు పెట్టుకున్న అమీర్ ఖాన్.. వీడియో వైరల్
Ibrahim Zardan | మా దేశ ప్రజల్ని సంతోషపరిచేది క్రికెట్ ఒక్కటే.. ఎందుకంటే?
Atal Setu | ప్రారంభానికి సిద్ధమైన దేశంలో సముద్రంపై అతిపెద్ద బ్రిడ్జి.. వంతెనపైకి ఆ వాహనాలు నిషిద్ధం