Ibrahim Zardan : వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లండ్, పాకిస్థాన్, శ్రీలంక వంటి పెద్ద జట్లకు షాకిచ్చిన అఫ్గనిస్థాన్ (Afghanistan) బలమైన టీమిండియాతో టీ20 సిరీస్‌కు సిద్ధమైంది. మొహాలీ స్టేడియం వేదికగా గురువారం రాత్రి 7 30 గంటలకు తొలి మ్యాచ్ జరుగనుంది. ఈ సిరీస్‌లో రషీద్ ఖాన్(Rashi Khan) బదులు కెప్టెన్‌గా వ్యవహరించున్న ఇబ్రహీం జర్డాన్(Ibrahim Zardan) స్వదేశంలో తమపై ఉన్న అంచనాలు, ప్రజలకు సంతోషాన్నిచ్చే విషయాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘వన్డే వరల్డ్ కప్‌లో మా ఆట చూశాక.. మా దేశంలో మాపై అంచనాలు ఎక్కువయ్యాయి. అప్పటినుంచి మా ప్రజలు మా నుంచి ఎంతో ఆశిస్తున్నారు. అందుకని మేము అద్భుతంగా ఆడి వాళ్లను సంతోషరచాలి అనుకుంటున్నాం. ఎందుకో తెలుసా..? అఫ్గన్ ప్రజల్ని ఎక్కువ సంతోషపెట్టేది క్రికెట్ ఒక్కటే’ అని జర్డాన్ తెలిపాడు. మూడు టీ20ల సిరీస్‌కు కెప్టెన్‌గా ఎంపికైన రషీద్ ఖాన్ గాయపడ్డాడు. దాంతో, అనుభవజ్ఞుడైన జర్డాన్ సారథిగా కొనసాగనున్నాడు.
‘రషీద్ పూర్తిగా ఫిట్‌గా లేడు. అయితే.. అతడు జట్టుతోనే మొహాలీకి వస్తున్నాడు. త్వరలోనే రషీద్ జట్టుతో కలుస్తాడని భావిస్తున్నా, అతడి స్థానాన్ని భర్తీ చేయగల బౌలర్లు మా జట్టులో ఉన్నారు. వాళ్లు బాగా రాణిస్తారనే నమ్మకం ఉంది. ఇక టీ20 వరల్డ్ కప్ కోసం మేము బ్యాటింగ్ విభాగంలో మరింత మెరుగవ్వాలి. ప్రపంచలోనే ఉత్తమ స్పిన్నర్లు మాకు ఉన్నారు’ అని జర్డాన్ వెల్లడించాడు.
The passion of the Afghan Nation has proved to be the driving force behind Afghanistan Cricket’s incredible rise.🤩
As #AfghanAtalan gear up for a historic #INDvAFG T20I series, let’s get behind them and extend our heartfelt wishes for their success in the upcoming series! 👏 pic.twitter.com/CzPO5JbUh3
— Afghanistan Cricket Board (@ACBofficials) January 10, 2024
తాలిబాన్ ప్రభుత్వం ఏర్పడ్డాక స్వేచ్ఛను కోల్పోయిన అఫ్గన్ ప్రజలు పలు రకాలుగా సతమతమవుతున్నారు. నిత్యం భయంభయంగా కాలం వెళ్లదీస్తున్న అక్కడివాళ్లకు క్రికెట్ పెద్ద ఊరటనిస్తోంది. అందుకనే అఫ్గన్ జట్టు మెగా టోర్నీల్లో మరింత కసిగా ఆడుతోంది.