Amazon Layoffs | గత ఏడాది కాలంగా ప్రపంచ వ్యాప్తంగా లేఆఫ్స్ (Layoffs) కొనసాగుతున్నాయి. దిగ్గజ సంస్థలు విడతలవారీగా ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్నాయి. తాజాగా ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ మరోసారి లేఆఫ్స్ (Amazon Layoffs) ప్రకటించింది. ఏడాది ప్రారంభంలోనే వందలాది మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు బ్లూమ్‌బర్గ్ నివేదిక వెల్లడించింది.
అమెజాన్ సంస్థ తన ప్రైమ్ వీడియో (Prime Video), ఎంజీఎం స్టూడియో (MGM divisions) విభాగం నుంచి వందల మంది ఉద్యోగులపై వేటు వేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు తొలగింపు సమాచారాన్ని స్ట్రీమింగ్ వీడియో, స్టూడియో డివిజన్, ఎంజీఎం యూనిట్ అధినేత మైక్ హోప్కిన్స్ ఉద్యోగులకు ఈ-మెయిల్స్ ద్వారా అందించనున్నట్లు వెల్లడించింది. తాజా తొలగింపులు అంతర్జాతీయంగా ఉంటాయని వెల్లడించినట్లుగా బ్లూమ్‌బర్గ్ పేర్కొంది.
బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం.. అమెజాన్ లైవ్ స్ట్రీమింగ్ సర్వీసెస్ ప్రైమ్ వీడియో స్టూడియో విభాగంలోని మొత్తం ఉద్యోగుల్లో 35 శాతం మందిని తొలగించేందుకు సంస్థ సిద్ధమైంది. దీని ప్రకారం చూసుకుంటే సుమారు 500 మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోనున్నారు. తొలగింపు సమాచారాన్ని తర్వలో సదరు ఉద్యోగులకు అందించనున్నారు.
Also Read..
Air Canada | షాకింగ్.. టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్న విమానంలోంచి దూకేసిన ప్రయాణికుడు
Aamir Khan | కూతురి పెళ్లిలో కన్నీళ్లు పెట్టుకున్న అమీర్ ఖాన్.. వీడియో వైరల్
BJP | బీజేపీకి షాక్.. పార్టీని వీడిన మాజీ మంత్రి ముఖేశ్‌గౌడ్ కుమారుడు