fuel leak | జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur)లో తాజాగా ప్రమాదం చోటు చేసుకుంది. ఓ పవర్ స్టేషన్ (power station) నుంచి భారీగా ఇంధనం లీకైంది (Heavy fuel leak). దీంతో ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. ఇంధన లీకేజీని కట్టడి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది.
కాంగ్పోక్పి (Kangpokpi) జిల్లాలోని లీమాఖోంగ్ పవర్ స్టేషన్లో (Leimakhong Power Station) బుధవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. పవర్ స్టేషన్ నుంచి పెద్ద ఎత్తున ఇంధనం లీకైంది. కాసేపటికే అది రోడ్లపై వరదలా పారింది. కొన్ని చోట్ల భారీగా మంటలు కూడా చెలరేగాయి. ఈ ఘటనతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఇంధనం ఇంఫాల్ లోయ (Imphal Valley)లోని నదిలో కలిసే ప్రమాదం ఉండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇంధన లీకేజీని వెంటనే అదుపు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు ఇంధన లీకేజీ కట్టడికి చర్యలు చేపట్టారు.
Also Read..
Bull Enters Bank | బ్యాంక్‌లోకి ప్రవేశించిన ఎద్దు.. వీడియో
Dense Fog | ఉత్తరాదిపై చలిపులి.. దట్టమైన పొగమంచు కారణంగా జీరోకు పడిపోయిన విజిబిలిటీ
YouTube India | అసభ్యకర వీడియోలు.. యూట్యూబ్ ఇండియాకు సమన్లు