Election Commission : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల (Delhi Assembly Elections) కు, ఉత్తరప్రదేశ్ (Uttarpradesh), తమిళనాడు (Tamil Nadu) లోని ఒక్కో అసెంబ్లీ స్థానంలో ఉప ఎన్నికల (Bye Elections) కు సంబంధించిన పోలింగ్ ఫిబ్రవరి 5న జరగనుంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 5న ఎగ్జిట్ పోల్స్ (Exit polls), ఇతర సర్వేలపై ఎన్నికల సంఘం (Election commission) నిషేధం విధించింది. ఈ మేరకు ఈసీ ఇప్పటికే నోటిఫికేషన్ కూడా జారీచేసింది. పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఫిబ్రవరి 5న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్ ప్రచురణపై నిషేధం విధించినట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నది.
ఫిబ్రవరి 5న పోలింగ్ ముగింపు సమయానికి ముందు 48 గంటల పీరియడ్‌లో ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి వార్తలనుగానీ, ఒపీనియన్ పోల్ వివరాలను గానీ, ఇతర పోల్ సర్వేల వివరాలను గానీ ప్రచురించడానికి, ప్రదర్శించడానికి వీల్లేదని కూడా ఈసీ తన నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతోపాటు ఉత్తరప్రదేశ్‌లోని మిల్కిపూర్ అసెంబ్లీ స్థానానికి, తమిళనాడులోని ఈరోడ్ అసెంబ్లీ స్థానానికి ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుంది.
ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తున్నారు. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సంపూర్ణ మెజారిటీతో గెలిచింది. 70 సీట్లలో 2015లో ఆప్ 67 స్థానాలను గెలుచుకుంది. బీజేపీ కేవలం 3 సీట్లకు పరిమితం కాగా, కాంగ్రెస్ అసలు ఖాతానే తెరువలేదు. 2020లో కూడా ఆప్ హవానే కొనసాగింది. ఆ పార్టీ 62 సీట్లు గెలుచుకోగా.. బీజేపీ మిగిలిన 8 స్థానాలు దక్కించుకుంది. వరుసగా రెండోసారి కూడా కాంగ్రెస్‌కు రిక్త హస్తమే మిగిలింది.
Supreme Court | ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత.. సుప్రీంకోర్టుకు కేటీఆర్
Shakeel Ahmad Khan | కాంగ్రెస్ ఎమ్మెల్యే కుమారుడు ఆత్మహత్య.. Video
Maha Kumbh Mela | వసంత పంచమి వేళ ప్రయాగ్‌రాజ్‌కు పోటెత్తిన భక్తులు.. పూలవర్షం కురిపించిన అధికారులు
AI University | దేశంలో తొలి ఏఐ వర్సిటీ.. ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే?
Maha Kumbh Mela | భక్తజనసంద్రంగా ప్రయాగ్‌రాజ్.. వసంత పంచమి అమృత స్నానాలు షురూ