Deol Family | బాలీవుడ్ దివంగత లెజెండరీ నటుడు ధర్మేంద్ర కుటుంబంలో విభేదాలు ఉన్నాయని గత కొన్నాళ్లుగా వస్తున్న ప్రచారానికి హేమమాలిని చెక్ పెట్టింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. సన్నీ డియోల్ మరియు బాబీ డియోల్లతో తనకు ఎలాంటి గొడవలు లేవని, తమ మధ్య మంచి రిలేషన్ ఉందని తెలిపింది.
మా కుటుంబంలో ధర్మేంద్ర గారు నేర్పిన క్రమశిక్షణ, విలువలు చాలా గొప్పవి. ఆయన ఎప్పుడూ మమ్మల్ని విడదీయాలని చూడలేదు.. అందరూ కలిసి ఉండాలనే కోరుకున్నారు. ఏదైనా కష్టం వచ్చినప్పుడు లేదా అవసరం వచ్చినప్పుడు సన్నీ, బాబీలు ఎప్పుడూ తమ వెంటే ఉన్నారని, తన కూతుళ్ల (ఈషా, అహానా) వివాహ వేడుకల్లో, ఇతర కార్యక్రమాల్లో వారి మద్దతు ఎప్పుడూ ఉందని హేమమాలిని తెలిపింది. మీడియాలో వచ్చే వార్తల్లో నిజం లేదని, అనవసరంగా తమ కుటుంబం గురించి తప్పుడు కథనాలు సృష్టించవద్దని ఆమె ఈ సందర్భంగా కోరారు.