ప్రయాగ్రాజ్: ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభ మేళ (Maha Kumbh Mela) భక్తజన సంద్రమైంది. వసంత పంచమి సందర్భంగా త్రివేణీ సంగమంలో అమృత స్నానాలకు భక్తులు పోటెత్తారు. చివరి అమృత్ స్నానాన్ని ఆచరించేందుకు నాగా సాధవులు, స్వామీజీలు, అఖాడాలు భారీగా తరలివచ్చారు. సోమవారం తెల్లవారుజాము నుంచే చలినిసైతం లెక్కచేయకుండా పుణ్యస్నానాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా వారిపై వారిపై నిర్వాహకులు హెలికాప్టర్ల ద్వారా పూల వర్షం కురిపించారు.
గంగా, యమున, సరస్వతి నదుల పవిత్ర సంగమమైన త్రివేణి సంగమంలో నిరంజని అఖాడా అధిపతి కైలాశానంద గిరి మహరాజ్, అఖాడాలకు చెందిన ఇతర సాధవులు తమకు కేటాయించిన ఘాట్లలో పవిత్ర స్నానాలు చేశారు. వీరితోపాటు విదేశీయులు, సాధారణ భక్తులు లక్షల సంఖ్యల సంఖ్యలో తరలివస్తుండటంతో ప్రయాగ్రాజ్ మరోసారి భక్తజనసంద్రమైంది. హరహర మహాదేవ్ నినాదాలతో ఘాట్లు మార్మోగుతున్నాయి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ సమాచార శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఉదయం 8 గంటల వరకు 62.25 లక్షల మందికిపైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. కాగా, వసంత పంచమిని పురస్కరించుకుని 4 నుంచి 6 కోట్ల మంది భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తున్నది.
మౌని అమావాస్య రోజు జరిగిన తొక్కిసలాట ఘటన దృష్ట్యా ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేసింది. మూడంచెల భద్రత నడుమ భక్తులు అమృత స్నానాలు చేస్తున్నారు. బారికేడ్లు ఏర్పాటుచేయడంతోపాటు ఘాట్ల వద్ద సింగల్ లైన్లో పంపిస్తున్నారు. అదేవిధంగా ప్రయాగ్రాజ్ లోపలికి కార్లను అనుమతించడం లేదు. బయటి రాష్ట్రాలనుంచి వచ్చే భక్తుల కోసం 84 పార్కింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 54 అతి జనసాంద్రత నియంత్రణ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
#WATCH | #MahaKumbhMela2025 | Prayagraj: After taking a holy dip, a devotee from Ukraine says, “I am feeling amazing and blessed. This is the happiest day of my life. This is my second Maha Kumbh. Amazing experience…” pic.twitter.com/p1NGjy9eYC
— ANI (@ANI) February 3, 2025
కాగా, ప్రయాగ్రాజ్లో పరిస్థితిని యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ సమీక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు అధికారుల నుంచి సమాచారం తెలుసుకుంటున్నారు. డీజీపీ, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీకి అవసరమైన సూచనలు చేస్తున్నారు. ఆయన అధికార నివాసంలో ప్రత్యేకంగా ఒక వార్రూమ్ ఏర్పాటు చేశారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
Faith transcends boundaries as foreign disciples from different countries participate in the Amrit Snan of Basant Panchami along with their revered Gurus at Triveni Sangam. #बसंतोत्सव_महाकुम्भ pic.twitter.com/i8w3EwUDtU
— Mahakumbh (@MahaKumbh_2025) February 3, 2025
#WATCH | #MahaKumbhMela2025 | Prayagraj, UP: Naga sadhus of the Juna Akhara take a holy dip as part of the Amrit Snan on the occassion of Basant Panchami. pic.twitter.com/1WsR4Elltj
— ANI (@ANI) February 3, 2025
#WATCH | #MahaKumbhMela2025 | Prayagraj: Flower petals showered on saints and seers taking a holy dip at Triveni Sangam on the occasion of Basant Panchami. pic.twitter.com/aZu7zEagif
— ANI (@ANI) February 3, 2025
#WATCH | #MahaKumbh2025 | Prayagraj: Naga Sadhus take a holy dip in the Triveni Sangam, a sacred confluence of three rivers – Ganga, Yamuna and Saraswati on the occasion of Basant Panchami. pic.twitter.com/LPLmmxe5N2
— ANI (@ANI) February 3, 2025
#MahaKumbhMela2025 | Chief Minister Yogi Adityanath has been continuously taking updates on the ‘Amrit Snan’ of Basant Panchami and giving necessary instructions to the DGP, Principal Secretary Home and officers of the Chief Minister’s Office, at the war room of his official… pic.twitter.com/Dc2qXuA53M
— ANI (@ANI) February 3, 2025
#MahaKumbhMela2025 | Chief Minister Yogi Adityanath has been continuously taking updates on the ‘Amrit Snan’ of Basant Panchami and giving necessary instructions to the DGP, Principal Secretary Home and officers of the Chief Minister’s Office, at the war room of his official… pic.twitter.com/Dc2qXuA53M
— ANI (@ANI) February 3, 2025