Maha Kumbh Mela | ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభ మేళ (Maha Kumbh Mela) భక్తజన సంద్రమైంది. నేడు వసంత పంచమి (Basant Panchami) సందర్భంగా త్రివేణీ సంగమం (Triveni Sangam)లో అమృత స్నానాలకు భక్తులు పోటెత్తారు. చివరి అమృత్ స్నానాన్ని ఆచరించేందుకు నాగా సాధవులు, స్వామీజీలు, అఖాడాలు భారీగా తరలివచ్చారు. సోమవారం తెల్లవారుజాము నుంచే చలినిసైతం లెక్కచేయకుండా పుణ్యస్నానాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా వారిపై నిర్వాహకులు హెలికాప్టర్ల ద్వారా పూల వర్షం కురిపించారు (Flower petals showered).
#MahaKumbhMela2025 | Prayagraj: Flower petals showered on devotees taking a holy dip at Triveni Sangam on the occasion of Basant Panchami.
As per Uttar Pradesh Information Department, today over 62.25 lakh devotees have taken a holy dip by 8 am. More than 34.97 crore devotees… pic.twitter.com/JS2p1fnQCk
— ANI (@ANI) February 3, 2025
మరోవైపు ఇవాళ ఉదయం 8 గంటల వరకూ దాదాపు 63 లక్షల మందికిపైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు యూపీ సర్కార్ తెలిపింది. వసంత పంచమిని పురస్కరించుకుని 4 నుంచి 6 కోట్ల మంది భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తున్నది. ఈ క్రమంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. మౌని అమావాస్య రోజు జరిగిన తొక్కిసలాట ఘటన దృష్ట్యా ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేసింది. మూడంచెల భద్రత నడుమ భక్తులు అమృత స్నానాలు చేస్తున్నారు. బారికేడ్లు ఏర్పాటుచేయడంతోపాటు ఘాట్ల వద్ద సింగల్ లైన్లో పంపిస్తున్నారు. అదేవిధంగా ప్రయాగ్రాజ్ లోపలికి కార్లను అనుమతించడం లేదు. బయటి రాష్ట్రాలనుంచి వచ్చే భక్తుల కోసం 84 పార్కింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 54 అతి జనసాంద్రత నియంత్రణ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
#WATCH | #MahaKumbh2025 | Prayagraj, UP: Flower petals being showered at Akharas and devotees at Triveni Sangam as they take part in ‘Amrit Snan’ on the occasion of Basant Panchami.
The last ‘Amrit Snan’ of Maha Kumbh 2025 is taking place today on the occasion of Basant… pic.twitter.com/9O2gLkrAaB
— ANI (@ANI) February 3, 2025
#WATCH | #MahaKumbh2025 | Prayagraj, UP: Flower petals being showered at Akharas and devotees at Triveni Sangam as they take part in ‘Amrit Snan’ on the occasion of Basant Panchami.
The last ‘Amrit Snan’ of Maha Kumbh 2025 is taking place today on the occasion of Basant… pic.twitter.com/zcqGT78yib
— ANI (@ANI) February 3, 2025
Also Read..
Maha Kumbh Mela | భక్తజనసంద్రంగా ప్రయాగ్రాజ్.. వసంత పంచమి అమృత స్నానాలు షురూ
Rishi Sunak | ఇంగ్లండ్, టీం ఇండియా మధ్య చివరి టీ20.. స్టేడియంలో సందడి చేసిన రిషి సునాక్
ISRO | కక్ష్యలోకి ప్రవేశించని ఎన్వీఎస్-02 శాటిలైట్.. ఇస్రో వందో ప్రయోగంలో సాంకేతిక లోపం