Rishi Sunak | బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్ (Rishi Sunak) ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇంగ్లండ్, టీం ఇండియా (India Vs England) మధ్య ముంబైలోని వాంఖడే స్టేడియంలో (Wankhede) ఆదివారం జరిగిన చివరి-ఐదో టీ20 మ్యాచ్‌కు హాజరయ్యారు. తన మామ, ఇన్ఫోసిస్ చీఫ్ నారాయణమూర్తి (Narayana Murthy)తో కలిసి మ్యాచ్ వీక్షించారు. ఈ సందర్భంగా ఆటగాళ్లతో సరదాగా ముచ్చటించి సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సునాక్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
Tough day for England at the Wankhede but I know our team will come back stronger.
Congratulations to Team India on the win.
Despite the result, it was an honour to meet @josbuttler and @surya_14kumar before the match and a pleasure to watch the cricket with my father-in-law. pic.twitter.com/m2nzQbFujG
— Rishi Sunak (@RishiSunak) February 2, 2025
జైపూర్‌లో ఐదు రోజులపాటు జరుగుతోన్న లిటరేచర్ ఫెస్టివల్లో పాల్గొనేందుకు శుక్రవారం రిషి సునాక్ భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే. శనివారం అక్కడ జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. అనంతరం ముంబైకి వెళ్లారు. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం స్థానిక పార్సీ జింఖానాకు వెళ్లి కాసేపు సరదాగా బ్యాట్ పట్టారు. అక్కడి వారితో కాసేపు క్రికెట్ ఆడుతూ ఎంజాయ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సైతం రిషి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
కాగా, ఇంగ్లండ్, టీం ఇండియా మధ్య ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆదివారం జరిగిన చివరి-ఐదో టీ20 మ్యాచ్‌లో 248 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ బ్యాటర్లు భారత్ బౌలర్ల దాటికి విలవిలలాడారు. క్రీజ్‌లో నిలవలేక పోయారు. ఫలితంగా కేవలం 10.3 ఓవర్లలోనే 97 పరుగులకు ఆలౌట్ అయ్యారు. దీంతో 150 పరుగుల తేడాతో టీం ఇండియా భారీ విజయాన్ని నమోదు చేసింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-2 తేడాతో సొంతం చేసుకుంది.
Also Read..
Team India | చివరి టీ-20లో ఇంగ్లండ్‌పై టీం ఇండియా 150 పరుగులతో విజయం..!
U19 T20 World Cup | అమ్మాయిలు అద్వితీయం.. మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్ మళ్లీ మనదే
Gongadi Trisha | తెలంగాణ కా షాన్ త్రిష.. భారత క్రికెట్లో మారుమోగుతున్న భద్రాచలం అమ్మాయి పేరు!