Gongadi Trisha | తెలంగాణ కా షాన్ త్రిష.. భారత క్రికెట్లో మారుమోగుతున్న భద్రాచలం అమ్మాయి పేరు!
గొంగడి త్రిష..ప్రస్తుత భారత క్రికెట్లో మారుమోగుతున్న తెలంగాణ అమ్మాయి పేరు! ఊహ తెలియని వయసులోనే క్రికెట్ బ్యాట్ చేతపట్టిన ఈ భద్రాచలం చిన్నది అంతర్జాతీయ స్థాయిలో దేశ ఖ్యాతిని దశదిశలా వ్యాపింపజేస్తున్నది. మలేషియా వేదికగా జరిగిన ఐసీసీ అండర్-19 టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ను విజేతగా నిలువడంలో త్రిషాది కీలక పాత్ర.
Gongadi Trisha | గొంగడి త్రిష..ప్రస్తుత భారత క్రికెట్లో మారుమోగుతున్న తెలంగాణ అమ్మాయి పేరు! ఊహ తెలియని వయసులోనే క్రికెట్ బ్యాట్ చేతపట్టిన ఈ భద్రాచలం చిన్నది అంతర్జాతీయ స్థాయిలో దేశ ఖ్యాతిని దశదిశలా వ్యాపింపజేస్తున్నది. మలేషియా వేదికగా జరిగిన ఐసీసీ అండర్-19 టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ను విజేతగా నిలువడంలో త్రిషాది కీలక పాత్ర. ప్రత్యర్థి ఎవరన్నది లెక్కచేయని నైజంతో బరిలోకి దిగే త్రిష.. తాను ఎదుర్కొన్న తొలి బంతి నుంచే ఎదురుదాడికి దిగడంలో దిట్ట అని చెప్పొచ్చు. మెగాటోర్నీలో ఏడు మ్యాచ్‌లాడిన ఈ యువ క్రికెటర్ 77.25 సగటుతో 309 పరుగులు సాధించింది.
వెస్టిండీస్‌తో మొదలై దక్షిణాఫ్రికాతో మ్యాచ్ వరకు త్రిష తనదైన శైలిలో ప్రతీ పోరులో సత్తాచాటింది. ఈ క్రమంలో ప్రత్యర్థులు నిర్దేశించిన స్వల్ప లక్ష్యఛేదనలోనూ తన మార్క్ బ్యాటింగ్‌తో జట్టును ముందుండి నడిపించింది. ఆడుతున్నది పేస్ అయినా.. స్పిన్ అయినా కళాత్మక షాట్లకు తోడు పవర్ఫుల్ హిట్టింగ్తో పరుగులు కొల్లగొట్టింది. స్కాట్లాండ్తో సూపర్‌సిక్స్ పోరులో అజేయ సెంచరీ(110*)తో కదంతొక్కింది. బౌలర్లను చెడుగుడు ఆడుకుంటూ మెగాటోర్నీ చరిత్రలో రికార్డు సెంచరీని తన పేరిట లిఖించుకుంది. ఇంగ్లండ్‌తో సెమీస్‌కు తోడు ఫైనల్లో సఫారీలపై సూపర్‌ఫామ్ కనబరుస్తూ భారత్‌కు రెండో ప్రపంచకప్‌ను అందించిన త్రిష..తెలంగాణ కా షాన్ అనడంలో అతిశయోక్తి లేదేమో!

Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhinidhi Desinghu | యూత్ ఒలింపిక్స్ స్విమ్మింగ్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన ధినిధి దేశింగు
Rajasthan | భారత్, పాకిస్థాన్ సరిహద్దులో రైల్వేట్రాక్‌పై భారీ పేలుడు.. ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిపివేత..!
Woman poses as TTE on train | రైలులో టీటీఈగా నటించిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే?
వృథాగా పోతున్న రాంపురం పెద్ద చెరువు నీరు
India Won: కివీస్‌తో తొలి వన్డే.. 5 వికెట్ల తేడాతో ఇండియా గెలుపు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

