Shakeel Ahmad Khan : కాంగ్రెస్ పార్టీ (Congress Party) సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే (MLA) షకీల్ అహ్మద్ ఖాన్ (Shakeel Ahmed Khan) ఇంట విషాదం చోటుచేసుకుంది. బీహార్ (Bihar) రాజధాని పట్నా (Patna) లోని గర్దానీబాగ్ ఏరియా (Gardanibagh area) లోగల ఆయన నివాసంలో ఖాన్ కుమారుడు ఉరేసుకున్నాడు. అయితే ఖాన్ కుమారుడి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
షకీల్ అహ్మద్ ఖాన్ ప్రస్తుతం కతిహార్ జిల్లాలోని కడ్వా అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు. అదేవిధంగా ఆయన కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శిగా కూడా పనిచేస్తున్నారు. ఖాన్ 1992లో ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడిగా కూడా పనిచేశారు. అప్పట్లో ఆయన ఎస్ఎఫ్ఐలో ఉన్నారు. అనంతరం 1999లో ఖాన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
#WATCH | Patna, Bihar | Congress leader Dr Shakeel Ahmad Khan’s son died allegedly by suicide. Visuals from his Gardanibagh residence. pic.twitter.com/e7IAW8Yr8l
— ANI (@ANI) February 3, 2025
Maha Kumbh Mela | వసంత పంచమి వేళ ప్రయాగ్‌రాజ్‌కు పోటెత్తిన భక్తులు.. పూలవర్షం కురిపించిన అధికారులు
AI University | దేశంలో తొలి ఏఐ వర్సిటీ.. ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే?
Maha Kumbh Mela | భక్తజనసంద్రంగా ప్రయాగ్‌రాజ్.. వసంత పంచమి అమృత స్నానాలు షురూ