హైదరాబాద్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ) : ఈనెల 6 నుంచి జూన్ 19 వరకు ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం నిర్వహించనున్నట్టు సీఎం రేవంత్రెడ్డి వెల్లడించారు. శనివారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కార్యక్రమ లోగోను తయారుచేస్తున్నట్టు చెప్పారు. పారిశ్రామికీకరణలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా ఉండాలని పేర్కొన్నారు. కేంద్ర ప్రాయోజిత పథకాలపై దృష్టి పెట్టాలని సూచించారు.
మదీనా ప్రమాద కుటుంబాలకు పరిహారం చెక్కులను సీఎం రేవంత్రెడ్డి అందజేశారు. శనివారం సెక్రటేరియట్లో 44మంది మృతుల కుటుంబసభ్యులకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున పరిహారం చెక్కులు అందించారు. నిరుడు నవంబర్ 17న సౌదీ అరేబియాలోని మదీనా సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 44 మంది హైదరాబాద్ వాసులు సజీవ దహమైన విషయం తెలిసిందే.