హైదరాబాద్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నేటి(ఆదివారం) నుంచి కొత్త వాహనాలు కొనుగోలు చేసేవారి నుంచి ప్రభుత్వం రోడ్ సేఫ్టీ పన్ను వసూలు చేయనున్నది. వాహనం కొనుగోలు చేయాలనుకునేవారు తమ వాహన శ్రేణిని బట్టి.. రూ.2 వేల నుంచి రూ.10వేల వరకు రవాణాశాఖకు చెల్లించాల్సి ఉంటుంది.
ఈ మేరకు గత బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఒక్క ఏడాదిలో కొత్తగా సుమారు 7 లక్షల వరకు ద్విచక్ర వాహనాలు, 2.57 లక్షల వరకు ఫోర్‌వీలర్స్, లక్ష వ రకు లైట్, హెవీ వెహికిల్స్‌ను కొనుగోలు చేస్తున్నారు. ఈక్రమంలో రవాణాశాఖకు భారీ మొత్తంలో ఆదాయం సమకూరనున్నది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ ప్రకారం రోడ్ సేఫ్టీ పన్ను వసూలు చేస్తున్నట్టు ఆర్టీఏ అధికారులు తెలిపారు.