Delhi Assembly : ఢిల్లీ (Delhi) అసెంబ్లీ సమావేశాల (Assembly session) ను మరో రెండు రోజులు పొడిగించారు. షెడ్యూల్ ప్రకారం అసెంబ్లీ ఫిబ్రవరి 24, 25, 27 తేదీల్లో మూడు రోజులపాటు కొనసాగాల్సి ఉంది. తాజాగా ఢిల్లీ సర్కారు ప్రకటించిన ప్రకారం ఫిబ్రవరి 28, మార్చి 1న కూడా సమావేశాలు జరగనున్నాయి. అంటే ఈ ప్రత్యేక సెషన్ (Special session) మూడు రోజులకు బదులుగా మొత్తం ఐదు రోజులు కొనసాగనుంది.
ఫిబ్రవరి 24న అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు మొదలవగానే ముందుగా ప్రొటెం స్పీకర్‌ను ఎన్నుకున్నారు. ఆ తర్వాత ప్రొటెం స్పీకర్ కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రమాణస్వీకారాలు చేయించారు. సీఎం రేఖా గుప్తా సహా ఎమ్మెల్యేలంతా ప్రమాణ స్వీకారాలు చేశారు. ఆ తర్వాత బీజేపీ ఎమ్మెల్యే విజేందర్ గుప్తాను అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నుకున్నారు. ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది.
ఇవాళ రెండో రోజు సభ మొదలవగానే సీఎం రేఖా గుప్తా.. కాగ్ నివేదికల్లో ఒక దానిని ప్రవేశపెట్టారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కారణంగా ప్రభుత్వానికి రూ.2000 కోట్ల నష్టం వచ్చిందని కాగ్ ఇచ్చిన నివేదికను సభ ముందుంచారు. దాంతో అధికార బీజేపీ, ప్రతిపక్ష ఆప్ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం జరిగింది. దాంతో స్పీకర్ ప్రతిపక్ష నాయకురాలు అతిషి సహా 21 మంది ఆప్ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేశారు. తదుపరి మూడు రోజులపాటు వారిపై సస్పెన్షన్ కొనసాగనుంది.
కాగ్ నివేదికపై చర్చకు ప్రభుత్వం పూనుకోగా.. అసెంబ్లీ నుంచి ఆంబేద్కర్ చిత్రపటాన్ని తొలగించారనే అంశాన్ని ఆప్ లేవనెత్తింది. దాంతో తమ తప్పులు బయటికి వస్తాయనే ఆప్ అంబేద్కర్‌ను అడ్డం పెట్టుకుంటోందని బీజేపీ విమర్శిస్తోంది. ఈ క్రమంలో కాగ్ నివేదికపై విస్తృతంగా చర్చ జరిపి ఆప్ సర్కారు తప్పిదాలను ఎండగట్టాలనేది ప్రభుత్వ వ్యూహంగా కనిపిస్తోంది. అందుకే అసెంబ్లీ సెషన్‌ను మరో రెండు రోజులు పొడిగించినట్లు తెలుస్తోంది.
Sajjan Kumar | తండ్రీ కొడుకులను తగులబెట్టిన కేసు.. కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్‌కు జీవిత ఖైదు
Manchu Vishnu | తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంచు విష్ణు..Video
Gulkand | మీకు గుల్కండ్ గురించి తెలుసా..? దీన్ని రోజూ తింటే.. ఎన్నో లాభాలు..!
Ranjana Nachiyaar | త్రిభాషా సూత్రం తప్పు.. బీజేపీకి తమిళ నటి రాజీనామా
Encounter | పంజాబ్‌లో ఎన్కౌంటర్.. దుండగుల కాళ్లలోకి దూసుకెళ్లిన పోలీస్ బుల్లెట్లు.. Video