న్యూఢిల్లీ, మార్చి 2: పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం కారణంగా భారత్-గల్ఫ్ దేశాల మధ్య విమాన రాకపోకలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. సోమవారం ఒక్కరోజే 350కిపైగా అంతర్జాతీయ విమాన సర్వీసుల్ని భారత విమానయాన సంస్థలు రద్దు చేయాల్సి వచ్చింది. విమానయాన సేవల్లో తీవ్ర అంతరాయం మూడవ రోజు కూడా కొనసాగినట్టు సంబంధిత అధికారులు వెల్లడించారు.
ఇండిగో 163, ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ 110, స్పైస్‌జెట్ 20, ఆకాశా ఎయిర్ 8..ై ఫ్లెట్ సర్వీసుల్ని నిలిపివేశాయి. దీంట్లో ఒమన్, సౌదీ అరేబియా, ఈజిప్ట్‌ల నుంచి ఉత్తర అమెరికా, యూరప్‌నకు ఎయిరిండియా నడుపుతున్న 20 ఫ్లైట్స్ ఉన్నాయి. మంగళవారం నాడూ పెద్ద సంఖ్యలో విమాన సర్వీసులు రద్దయ్యే అవకాశం కనిపిస్తున్నది. భారత్ నుంచి అబుదాబి, దోహా, జెడ్డా, కువైట్, రియాద్‌లకు రాకపోకలు సాగించే తమ విమాన సర్వీసుల్ని రద్దు చేసినట్టు ‘ఆకాశా ఎయిర్’ ఇప్పటికే తెలిపింది.