Farmer | సాగు నీటి కష్టాలు.. ఎస్ఐ కాళ్లపై పడ్డ రైతన్న.. వీడియో
Farmer | కాంగ్రెస్ సర్కార్ హయాంలో రైతులు యూరియా కోసం, సాగు నీటి కోసం అధికారుల కాళ్లు పట్టుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఖమ్మం జిల్లా వైరా రిజర్వాయర్ నుంచి సాగునీరు విడుదల చేయాలని ఐబీ కార్యాలయం ముందు రైతులు నిరసన బాట పట్టారు.
Farmer | కాంగ్రెస్ సర్కార్ హయాంలో రైతుల సాగునీటి కష్టాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఓ వైపు ఆలస్యంగా కురిసిన వర్షాలు.. మరోవైపు చాలీ చాలని సాగునీటితో రైతన్న పడుతున్న ఇబ్బందులు ఎలా ఉన్నాయో తెలిపే వీడియో ఇది. రైతులు యూరియా కోసం, సాగు నీటి కోసం అధికారుల కాళ్లు పట్టుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. తాజాగా ఓ రైతు నీళ్ల కోసం ఎస్సై కాళ్లు పట్టుకున్నారు.
ఖమ్మం జిల్లా వైరా రిజర్వాయర్ నుంచి సాగునీరు విడుదల చేయాలని ఐబీ కార్యాలయం ముందు రైతులు నిరసన బాట పట్టారు. రిజర్వాయర్‌లో 17 అడుగుల నీరు ఉన్నప్పటికీ ఈ సర్కార్ సాగు నీరు విడుదల చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళనలో పాల్గొన్న రైతులను పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఓ అన్నదాత తమ నిరసనను అడ్డుకోవడానికి వచ్చిన ఎస్సై కాళ్లపై పడి నీటిని విడుదల చేయించాలని వేడుకున్నారు.
రాష్ట్రంలో రైతన్నల పరిస్థితి ఎలా ఉందో చెప్పే ఈ దృశ్యం రైతుల పట్ల రేవంత్ సర్కార్ నిర్లక్ష్యవైఖరి కండ్లకు కట్టినట్టు చూపిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
నీళ్ల కోసం ఎస్సై కాళ్లు పట్టుకున్న రైతు
ఖమ్మం జిల్లా వైరా రిజర్వాయర్ నుంచి సాగునీరు విడుదల చేయాలని ఐబీ కార్యాలయం ముందు రైతుల నిరసన
రిజర్వాయర్‌లో 17 అడుగుల నీరు ఉన్నప్పటికీ ఈ ప్రభుత్వం విడుదల చేయడం లేదని ఆగ్రహం
నిరసనను అడ్డుకోవడానికి వచ్చిన ఎస్సై కాళ్లపై పడి నీటిని విడుదల… pic.twitter.com/rkP766M3rk
— Telugu Scribe (@TeluguScribe) August 17, 2026
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

