BJP: అనురాగ్ ఠాకూర్, స్మృతి ఇరానీ, ధర్మేంద్ర ప్రధాన్.. బీజేపీ చీఫ్ కొత్త టీమ్‌లో వీరికి చోటు !
BJP: బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్ బృందంలోకి కొత్త సభ్యులు రానున్నారు. అయితే అనేక మంది పేర్లు ప్రస్తుతం రౌండ్స్ కొడుతున్నాయి. సీనియర్ లీడర్లు సతీశ్ పూనియా, ధర్మేంద్ర ప్రధాన్, అనురాగ్ ఠాకూర్, స్మృతి ఇరానీ పేర్లు ఆ జాబితాలో ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ(BJP)లో భారీ మార్పులు జరగనున్నాయి. కీలక నేతలను మార్చే అవకాశాలు ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్ బృందంలోకి కొత్త సభ్యులు రానున్నారు. అయితే అనేక మంది పేర్లు ప్రస్తుతం రౌండ్స్ కొడుతున్నాయి. బీజేపీ సర్కిల్స్ ప్రకారం సీనియర్ లీడర్లు సతీశ్ పూనియా, ధర్మేంద్ర ప్రధాన్, అనురాగ్ ఠాకూర్, స్మృతి ఇరానీ పేర్లు వినిపిస్తున్నాయి. బీజేపీ సంస్థాగత పాత్రల్లో ఈ సీనియర్లకు కీలక బాధ్యతలు దక్కే అవకాశాలు ఉన్నాయి. మధ్యప్రదేశ్ బీజేపీ మాజీ అధ్యక్షుడు వీడీ శర్మకు కూడా కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ పార్టీలోనైనా లేదా ప్రధాని మోదీ క్యాబినెట్‌లోనైనా ఆయనకు కీలక స్థానం దక్కనున్నట్లు అంచనా వేస్తున్నారు.
త్రిపుర మాజీ సీఎం బిప్లబ్ దేబ్‌కు కూడా కీలక హోదా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే బీజేపీ జాతీయ జనరల్ సెక్రటరీల పోస్టుల్లో భారీ మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం బీజేపీకి ఏడు మంది జనరల్ సెక్రటరీలు ఉన్నారు. వారిలో అర్జున్ సింగ్, దుశ్యంత్ గౌతమ్, వినోద్ తవడే, తరుణ్ చుగ్, సునిల్ భన్సల్, రాధామోహన్ దాస్ అగర్వాల్, బీఎల్ సంతోష్ ఉన్నారు. దుశ్యంత్ గౌతమ్, రాధామోహన్ దాస్‌లకు రెస్ట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సెగ్మెంట్లో ముఖ్య నేతలు అనురాగ్ ఠాకూర్, సతీశ్ పూనియాలకు ఛాన్స్ ఇవ్వనున్నారు. ధర్మేంద్ర ప్రధాన్‌కు కూడా జనరల్ సెక్రటరీ బాధ్యతలు దక్కే అవకాశాలు ఉన్నాయి.
అయితే ఈ ఊహాగానాలపై ఇంకా ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు. ఈశాన్య ప్రాంతానికి సంబంధించి రాజ్యసభ ఎంపీ సంజయ్ భాటియాకు కీలక పదవి దక్కే అవకాశాలు ఉన్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saluru | ఎన్నికల కోసం పెళ్లి.. చివరికి సీటు జనసేనకు! టీడీపీ నేతకు షాక్ మీద షాక్!
రూ.280 కోట్ల పనులకు మోక్షమెప్పుడో.. రోడ్ల పనుల డిమాండ్‌తో మక్తల్–నారాయణపేట రహదారిపై చిట్టెం పాదయాత్ర..
Ranabaali | ‘రణబాలి’ ఫస్ట్ డే కలెక్షన్స్.. విజయ్ దేవరకొండకు ఈ చిత్రంతోను నిరాశేనా ..!
Chiranjeevi | చిరంజీవి సాయం.. సెన్సార్ చిక్కుల నుంచి బయటపడిన ‘కామ్రేడ్ కల్యాణ్’
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

