హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ) : యుద్ధం కారణంగా పశ్చిమాసియాలోని వివిధ దేశాల్లో నివసిస్తున్న, చిక్కుకుపోయిన తెలంగాణ వాసులు, వారి బంధువుల సౌకర్యార్థం ఢిల్లీ తెలంగాణ భవన్లో 24/7 కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటుచేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఇప్పటికే తాము విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖతోపాటు ఆయా దేశాల్లోని మన రాయబార కార్యాలయాలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నట్లు ఢిల్లీలోని తెలంగాణ భవన్ అధికారులు తెలిపారు.
ప్రభావిత దేశాల్లో నివసిస్తున్న తెలంగాణ వాసులు, అక్కడ చిక్కుకుపోయిన తెలంగాణ వారు, అలాగే, ఇక్కడి వారి బంధువులు తీవ్ర ఆందోళనకు గురవుతున్న నేపథ్యంలో, కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటుచేసినట్లు, అవసరమైన వారు 9871999044, 9958322143, 9910014749, 9643723157 నంబర్లపై కంట్రోల్ రూమ్‌ను సంప్రదించవచ్చని వారు వివరించారు.