ఛత్రపతి శంభాజీ నగర్ : గ్రామీణ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, జవాబుదారీతనాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ‘స్కూల్ ఠీక్ కరో’(పాఠశాలలను బాగు చేయండి) పేరుతో ప్రచార ఉద్యమాన్ని మహారాష్ట్రలోని హింగోలీ జిల్లాలో సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్వాతంత్య్ర దినోత్సవం(ఆగస్టు 15)నాడు ప్రారంభిస్తారని పార్టీ ప్రకటన విడుదల చేసింది.
దీప్కే విలేకరులతో మాట్లాడుతూ, తన స్వగ్రామం నుంచి ‘స్కూల్ ఠీక్ కరో’ ప్రచారాన్ని ప్రారంభిస్తానని, అక్కడ సర్పంచ్‌ను ప్రభుత్వ పాఠశాలను బాగు చేయాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరతానని తెలిపారు. గ్రామాలను సందర్శించి, పాఠశాలల పరిస్థితిని మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలను, సర్పంచ్‌లను కోరే బృందాలను ఏర్పాటు చేశామని అభిజీత్ మీడియాకు తెలిపారు.