టిను అనంద్, ఉపేంద్ర, జార్జ్ మరియన్, అక్షయ్, విష్ణుకార్తికేయ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న న్యూఏజ్ క్రైమ్ కామెడీ ‘బా బా బ్లాక్‌షీప్’. గుణి మంచికంటి దర్శకుడు. చిత్రాలయం స్టూడియోస్ పతాకంపై వేణు దోనేపూడి నిర్మిస్తున్నారు. దసరా సందర్భంగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 9న విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఈ సినిమా నుంచి ‘ఆజా మేరీ జాని’ అంటూ సాగే తొలి పాటను అగ్ర సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ విడుదల చేశారు.
ఈ పార్టీ సాంగ్‌ను అజయ్ లగుసాని, ఓయ్ విష్ణులపై చిత్రీకరించారు. ఓ ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ చుట్టూ అల్లుకున్న కథ ఇదని, ఆద్యంతం అనూహ్య మలుపులతో సాగుతుందని, మేఘాలయా రాష్ట్రంలో చిత్రీకరణ జరిపామని చిత్ర నిర్మాత వేణు దోనేపూడి తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: అజయ్ అబ్రహం జార్జ్, సంగీతం: స్టీఫెన్, ఆనంద్, క్రియేటివ్ ప్రొడ్యూసర్: శ్వేత దోనేపూడి, దర్శకత్వం: గుణి మంచికంటి.