అగ్ర నటి సమంత హాలిడే ట్రిప్‌కి రెడీ అవుతున్నారు. తన ప్రెగ్నెన్సీకి చెందిన ప్రతి క్షణాన్నీ ఆస్వాదించేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారామె. ఎప్పుడూ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే సామ్.. తాజాగా ఓ పోస్ట్ పెట్టారు. ‘ఈ హాలిడేకు రెండు జతల బట్టలు మాత్రమే సర్దుతున్నా. నిజానికి నా దగ్గర చాలా డ్రెస్సులున్నాయి. కానీ అవేమీ ఇప్పుడు నాకు సరిపోవడం లేదు. అందుకే సరిపోయే రెండు జతలు మాత్రమే సర్దుతున్నా’ అంటూ ఆ పోస్టులో పేర్కొన్నది సమంత.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాతృత్వం గురించి సమంత మాట్లాడిన మాటలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ‘ ‘అమ్మ’ అని పిలిపించుకునే క్షణాలకోసం నేనెంతో పరితపిస్తున్నాను. నా బిడ్డను మోస్తున్నాననే అనుభూతి నా హృదయాన్ని ఆనందంతో నింపేస్తున్నది. ఈ ప్రయాణాన్ని ప్రతి క్షణం ఆస్వాదిస్తున్నా. నాకెందుకో ప్రతిరోజూ కొత్తగా ఉంది’ అంటూ సమంత భావోద్వేగానికి లోనయ్యారు.