న్యూఢిల్లీ : పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. పౌరుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ఘర్షణలను సాధ్యమైనంత త్వరగా ముగించాలని సూచించారు.
యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌కు కూడా ఫోన్ చేసిన మోదీ ఆయనతో మాట్లాడారు. ఇరాన్ దాడులను ఖండించారు. యూఏఈకి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. బహ్రెయిన్, సౌదీ అరేబియాపై ఇరాన్ దాడులను కూడా ప్రధాని మోదీ ఖండించారు. ఈ మేరకు సౌదీ యువరాజు మహ్మద్ సల్మాన్, బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాతో ఫోన్లో మాట్లాడారు.