మంగళవారం 04 ఆగస్టు 2020
National - Jul 19, 2020 , 17:23:50

బిహార్‌ రెజిమెంట్‌ సైనికులను కలిసిన రక్షణ మంత్రి

బిహార్‌ రెజిమెంట్‌ సైనికులను కలిసిన రక్షణ మంత్రి

జమ్మూ కశ్మీర్‌ : కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌  బిహార్‌ రెజిమెంట్‌కు చెందిన సైనికులను కలిశారు. గాల్వాన్‌ లోయలో చైనా సైనికులతో వీరోచితంగా పోరాడిన సైనికులను కలిసి, ఒక్కొక్కరి భుజం తట్టి అభినందించారు. ఈ మేరకు రక్షణ మంత్రి కార్యాలయం ఆదివారం ట్విట్టర్‌ ద్వారా వీడియోను విడుదల చేసింది. జూన్‌ 15న గాల్వాన్‌ లోయలో భారత్‌ - చైనా ఆర్మీకి మధ్య జరిగిన ఘర్షణలో కర్నల్‌ సంతోష్‌బాబుతో పాటు 20 మంది జవాన్లు మృతి చెందిన విషయం తెలిసిందే. ఇటీవల జమ్మూ కశ్మీర్‌, లడఖ్‌లో వరుసగా రక్షణ మంత్రి పర్యటిస్తున్నారు.  పర్యటనలో తొలిరోజు శుక్రవారం లడఖ్‌లోని దళాలను చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ బిపిన్‌ రావత్‌, ఆర్మీ జనరల్‌ ఎంఎం నరవానేతో కలిసి భేటీ అయ్యారు. శనివారం కశ్మీర్‌ కుప్వారా జిల్లాలోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) సమీపంలోని ఫార్వర్డ్‌ పోస్టును సందర్శించారు. అక్కడ మోహరించిన సైనికులతో సంభాషించారు. అలాగే అమర్‌నాథ్‌ గుహను సందర్శించి, పూజలు చేసిన విషయం తెలిసిందే.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.logo