e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, May 15, 2021
Home టాప్ స్టోరీస్ నాగార్జున‌సాగ‌ర్‌లో ప్రారంభ‌మైన పోలింగ్

నాగార్జున‌సాగ‌ర్‌లో ప్రారంభ‌మైన పోలింగ్

నాగార్జున‌సాగ‌ర్‌లో ప్రారంభ‌మైన పోలింగ్

హాలియా: నాగార్జునసాగ‌ర్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభ‌మ‌య్యింది. దివంగ‌త‌ ఎమ్మెల్యే నోముల న‌ర్సింహ‌య్య మృతితో ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఉప ఎన్నిక‌లు అనివార్య‌మ‌య్యాయి. ఉద‌యం 7 గంట‌ల‌కు ప్రారంభ‌మైన పోలింగ్ సాయంత్రం 7 గంట‌ల‌కు ముగియ‌నుంది. నియోజ‌క‌వ‌ర్గం వ్యాప్తంగా మొత్తం 2,20,300 మంది ఓట‌ర్లు త‌మ ఓటుహ‌క్కు వినియోగించుకోనున్నారు. ఇందులో 1,09,228 మంది పురుషులు, 1,11,072 మంది మ‌హిళ‌లు ఉన్నారు. మొత్తం 346 పోలింగ్ కేంద్రాల‌ను ఏర్పాటు చేసింది.

క‌రోనా ప్ర‌త్యేక ప‌రిస్థితుల నేప‌థ్యంలో గ‌తంలో ఎన్న‌డూ లేనివిధంగా కేంద్ర ఎన్నిక‌ల సంఘం (సీఈసీ) పోలింగ్ స‌మ‌యాన్ని రెండు గంట‌ల‌పాటు పొడిగించింది. ఈ ఎన్నిక‌ల్లో మొత్తం 41 మంది బ‌రిలో నిలిచారు. టీఆర్ఎస్ పార్టీ త‌ర‌ఫున నోముల భ‌గ‌త్ పోటీలో ఉన్నారు. భ‌గ‌త్ విజ‌యం కోసం టీఆర్ఎస్ పార్టీ ముమ్మ‌రంగా ప్ర‌చారం నిర్వ‌హించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చదవండి..

బెంగాల్‌లో ఐదో దశ ఎన్నికల పోలింగ్‌ షురూ
అన్ని కేసులపై ఒకేసారి విచారణ
వానాకాలం దండిగా వర్షాలు
గాలిలో కరోనా
పిల్లలపై పంజా
ఆక్సిజన్‌ ఉత్పత్తిని పెంచండి
Advertisement
నాగార్జున‌సాగ‌ర్‌లో ప్రారంభ‌మైన పోలింగ్
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement