e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, May 9, 2021
Home టాప్ స్టోరీస్ గతేడాదిలాగే ఎస్సెస్సీ గ్రేడ్స్‌!

గతేడాదిలాగే ఎస్సెస్సీ గ్రేడ్స్‌!

గతేడాదిలాగే ఎస్సెస్సీ గ్రేడ్స్‌!
  • ఫార్మేటివ్‌ అసెస్‌మెంటే ఆధారం
  • విద్యాశాఖ అధికారుల కసరత్తు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 16 (నమస్తే తెలంగాణ): కరోనా కారణంగా పదో తరగతి పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో విద్యార్థులకు గ్రేడింగ్‌ ఇవ్వడంపై ఎస్సెస్సీ బోర్డు కసరత్తు చేసున్నది. గతేడాది కూడా ఎస్సెస్సీ పరీక్షలను రద్దుచేసి ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌ (ఎఫ్‌ఏ) ఆధారం గా గ్రేడింగ్‌ ఇచ్చారు. ఈ ఏడాదీ అలానే ఇవ్వనున్నారు. దీనిపై వారంలో నిర్ణయం వెలువడనుందని సమాచారం.

మార్కుల లెక్కింపు ఇలా..

  • ఏటా ఎస్సెస్సీ విద్యార్థులకు 4 ఎఫ్‌ఏలు నిర్వహించేవారు. 40 రోజులకు మించకుండా బోధించిన పాఠ్యాంశాలకు ఈ పరీక్షలు జరిపేవారు. 4 ఎఫ్‌ఏలకు సంబంధించిన 80 మార్కులను 20 మార్కులకు కుదించి తుది ఫలితాల్లో కలిపేవారు. ఈ ఏడాది రెండు ఎఫ్‌ఏలు జరపాలని నిర్ణయం తీసుకున్నా ఒకే ఎఫ్‌ఏ సాధ్యమైంది. ఆ పరీక్ష మార్కుల అప్‌లోడింగ్‌ ప్రక్రియ జరుగుతున్నది.
  • గతేడాది 20 ఎఫ్‌ఏ మార్కులను 100గా పరిగణించి, విద్యార్థి సాధించిన ఎఫ్‌ఏ మార్కులు కలిపి గ్రేడ్లుగా ఇచ్చారు. ఉదాహరణకు ఒక విద్యార్థికి తెలుగులో 20 మార్కులకు 16 మార్కులు వచ్చినట్టయితే 16×5=80 మార్కులు వచ్చినట్లుగా లెక్కించి A2 గ్రేడ్‌ను కేటాయించారు. ఇదే తరహాలో అన్ని సబ్జెక్టుకు ఎఫ్‌ఏ మార్కులతో లెక్కించి గ్రేడ్లు కేటాయించారు.
  • ఎఫ్‌ఏలో 7 మార్కు లు వచ్చినా విద్యార్థి పాస్‌ అయినట్టేనని అధికారులు చెప్తున్నారు. హిందీలో 4 మార్కులు వచ్చినా సరిపోతుందని అంటున్నారు. ప్రధాన పరీక్షల్లో హిందీలో 20, ఇతర సబ్జెక్టుల్లో 35 మార్కులు వస్తే పాస్‌ అయినట్టుగా పరిగణిస్తారన్న విషయం తెలిసిందే. ఉపాధ్యాయులు ఇంటర్నల్‌ మార్కుల్లో ఫెయిల్‌ చేయరని, ఈ లెక్కన విద్యార్థులంతా పాస్‌ అయినట్టేనని చెప్తున్నారు. ఈ విషయంలో టీచర్లు, విద్యావేత్తల అభిప్రాయాలు కూడా తీసుకుంటామన్నారు. సీబీఎస్‌ఈ కొత్త ఫార్ములా కోసం కూడా వేచిచూస్తున్నట్టు తెలిపారు.

గ్రేడ్ల అంచనా

గ్రేడ్‌ (జీపీఏ) సబ్జెక్టుల్లో హిందీలో
A1 (10) 18-20 18-20
A2 (9) 16-17 16-17
B1 (8) 14-15 14-15
B2 (7) 12-13 11-13
C1 (6) 10- 11 09-10
C2 (5) 08-09 07-08
D1 (4) 07 04 -06
D2 (0-3) 06 00 -03

Advertisement
గతేడాదిలాగే ఎస్సెస్సీ గ్రేడ్స్‌!
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement