e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 16, 2021
Home News 301 జిల్లాల్లో 20 శాతానికిపైగా పాజిటివిటీ రేటు: కేంద్రం

301 జిల్లాల్లో 20 శాతానికిపైగా పాజిటివిటీ రేటు: కేంద్రం

301 జిల్లాల్లో 20 శాతానికిపైగా పాజిటివిటీ రేటు: కేంద్రం

న్యూఢిల్లీ: దేశంలో కరోనా విల‌యం కొన‌సాగుతున్న‌ది. నగరాలు, పట్టణాలు, ప‌ల్లెలు అనే తేడా లేకుండా అంత‌టా ఈ మ‌హ‌మ్మారి విస్త‌రించింది. ప్రస్తుతం దేశంలోని 40 శాతం జిల్లాల్లో 20 శాతానికి పైగానే పాజిటివిటీ రేటు ఉంద‌ని కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం 741 జిల్లాలకుగానూ 301 జిల్లాల్లో 20 శాతం అంత‌కుమించి పాజిటివిటీ న‌మోదువుత‌న్న‌ద‌ని తెలిపింది. వాటిలో 15 జిల్లాల్లో అయితే ఏకంగా 50 శాతానికిపైగానే పాజిటివిటీ రేటు ఉంద‌ని పేర్కొన్న‌ది.

ఆ 15 జిల్లాల్లో హ‌ర్యానా జిల్లాలు నాలుగు, అరుణాచల్‌ప్రదేశ్ జిల్లాలు రెండు, రాజస్థాన్ జిల్లాలు రెండు కాగా.. మ‌రో ఏడు జిల్లాలు ఏడు వేర్వేరు రాష్ట్రాల్లో ఉన్నాయి. అరుణాచల్‌ ప్రదేశ్‌లోని చంగ్లాంగ్‌ జిల్లాలో అత్యధికంగా 91.5 శాతం పాజిటివిటీ రేటు ఉందని, అదే రాష్ట్రంలోని దిబాన్‌ వ్యాలీతోపాటు పుదుచ్చేరిలోని యానాం, రాజస్థాన్‌లోని బికనీర్‌, పాలీ జిల్లాల్లో అత్యధిక పాజిటివిటీ రేటు నమోదవుతున్నద‌ని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

ఇక కేరళలోని 14 జిల్లాలకుగాను 13 జిల్లాల్లో 20 శాతానికిపైగా పాటిజివిటీ రేటు నమోదువుతున్న‌ది. హ‌ర్యానాలో 22 జిల్లాలకుగాను 19 జిల్లాల్లో, పశ్చిమబెంగాల్‌లో 23 జిల్లాల‌కుగాను 19 జిల్లాల్లో, ఢిల్లీలో 11 జిల్లాల‌కుగాను 9 జిల్లాల్లో, కర్ణాటకలో 31 జిల్లాల‌కుగాను 24 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 20 శాతానికిపైగా ఉన్న‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ ప్ర‌క‌టించింది. మ‌హ‌మ్మారి క‌ట్ట‌డి కోసం ప‌లు రాష్ట్రాలు లాక్‌డౌన్‌లు, క‌ర్ఫ్యూలు విధిస్తున్నా ప‌రిస్థితి అద‌పులోకి రాక‌పోవ‌డం ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి..

కాబూల్ పేలుళ్లు: 50 దాటిన మృతుల సంఖ్య‌

క్ష‌ణికావేశంలో భార్య‌ను చంపి భ‌ర్త ఆత్మ‌హ‌త్య‌

పండ్లలో విటమిన్‌.. ఇమ్యూనిటీ పెంచెన్‌

మైదా పిండి.. కొడుతుంద‌ట‌ ఆరోగ్యానికి గండి..!

మ‌హ‌మ్మారి మ‌ర‌ణ మృదంగం.. వ‌రుస‌గా రెండో రోజూ 4 వేల‌కుపైగా మృతులు

గోమూత్రం తాగండి.. క‌రోనాను నిలువ‌రించండి: బీజేపీ ఎమ్మెల్యే స‌ల‌హా

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
301 జిల్లాల్లో 20 శాతానికిపైగా పాజిటివిటీ రేటు: కేంద్రం

ట్రెండింగ్‌

Advertisement