రూ.24.77లక్షల నగదు సీజ్
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల వద్ద రూ. 24.77 లక్షల నగదును పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు.
- మానుకోట జిల్లాల్లో వేర్వేరు చోట్ల పట్టివేత
కేసముద్రం/కురవి/డోర్నకల్/బయ్యారం, ఏప్రిల్26: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల వద్ద రూ. 24.77 లక్షల నగదును పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. కేసముద్రానికి చెందిన హరి నెకొండ్కకు రూ.18 లక్షల నగదును తీసుకెళ్తుండగా కేసముద్రం మండలం కోరుకొండపల్లి స్టేజీ వద్ద పట్టుకొని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వంశీధర్ తెలిపారు. కురవి మండలం నేరడ శివారు బాల్యతండాకు చెందిన వ్యక్తి రూ.3.50లక్షల నగదును తీసుకెళ్తుండగా పట్టుకున్నట్లు కురవి ఎస్సై గోపీ తెలిపారు. డోర్నకల్ ఎస్సీ బీసీకాలనీ వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద ఖమ్మం జిల్లా మంచుకొండకు చెందిన వినోద్ సహానీ నుంచి రూ.లక్ష స్వాధీనం చేసుకున్నట్లు సిబ్బంది తెలిపారు. ముల్కలపల్లికి చెందిన బోడ సాయికుమార్ ఖమ్మం నుంచి బొలెరో వాహనంలో తీసుకొస్తున్న రూ.52వేలను సీజ్ చేశారు. ఇల్లెందు, మహబూబాబాద్ జాతీయ రహదారిపై గార్ల, బయ్యారం సరిహద్దు సత్యనారాయణపురం క్రాస్‌రోడ్డు వద్ద ఐపీఎస్ ట్రైనీ బయ్యారం ఎస్‌హెచ్‌వో చేతన్‌నితిన్, సీఐ రవికుమార్ నేతృత్వలో ఎస్సైలు మౌలానా, జీనత్ వాహన తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో వ్యాపారులు బరిగల ప్రేమ్‌కుమార్ రూ.75వేలు, శివలింగయ్య నుంచి రూ.లక్ష నగదు సీజ్ చేశారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

