Hyderabad | కన్న తండ్రి క్రూర మృగంలా మారాడు. కంటికి రెప్పలా కాపాడాల్సిన వాడే పశువులా మారిపోయాడు. కన్న కూతురిపై లైంగిక దాడికి(Father assaults) పాల్పడ్డాడు. ఈ అమానీవయ ఘటన సనత్నగర్ (Sanathnagar) పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నిందితుడు(45) తన భార్య ముగ్గురు కూతుళ్లతో కలిసి సనత్నగర్లో హౌస్కీపింగ్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
మద్యానికి బానిసై తరచూ భార్యా బిడ్డలతో గొడవలు పెట్టుకునేవాడని సమాచారం. కాగా, మద్యం మత్తులో విచక్షణ కోల్పోయి తన రెండో కూతురిపై కన్నేసి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. కుటుంబం పరువు పోతుందని విషయం బయటకు రాకుండా కుటుంబ సభ్యులు జాగ్రత్త పడ్డారు. కానీ తండ్రి అరాచకాలు ఆగకపోవడంతో, ఓపిక నశించిన బాలిక సనత్నగర్ పోలీసులను ఆశ్రయించింది. దీంతో బాలిక తండ్రిపై పోక్సో కేసు( POCSO case) నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.