Snake Hiding | పాములు పట్టడమంటేనే (Snake Hiding) ఓ సాహస చర్య. ధైర్య సాహసాలతో కూడుకున్న పని. ఏమాత్రం పట్టుతప్పినా సరే మన ప్రాణాలకు ముప్పు వాటిల్లినట్లే. దీనికి ఎంతో అనుభవం ఉండాలి. ఇప్పటి వరకూ స్నేక్ క్యాచర్స్లో పురుషులనే ఎక్కువగా చూసి ఉంటాం. మహిళలు ఈ వృత్తిలో చాలా అరుదుగా ఉంటారు. తాజాగా ఓ మహిళా స్నేక్ క్యాచర్ సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఎంతో అలవోకగా ఎలుకను పట్టినట్లు పామును పట్టి ఆశ్చర్యపరుస్తోంది.
ఛత్తీస్గఢ్ (Chhattisgarh) రాష్ట్రంలోని బిలాస్పూర్లో ఓ కార్యాలయంలోకి పాము వచ్చింది. దీంతో అక్కడి సిబ్బంది స్థానిక పాములు పట్టేవాళ్లకి సమాచారం అందించారు. ఆ వెంటనే అజిత పాండే (Ajita Pandey) అనే మహిళ ఎలాంటి సేఫ్టీ స్టిక్ లేకుండా అక్కడికి వచ్చింది. కార్యాలయంలోని ఫైల్స్ కింద దాగి ఉన్న పామును గుర్తించి పట్టేసింది. ‘జాగ్రత్త.. అది మీదకు వస్తుంది’ అంటూ పక్కన ఉన్న వ్యక్తులు చెప్తున్నా.. ఎలాంటి అదురూ, బెదురూ లేకుండా ఆ పామును ఒట్టి చేతులతో ఒక్కసారిగా పట్టేసింది.
‘ఇది విషం లేని పాము. బహుశా ఎలుకలను తినేందుకు ఇక్కడికి వచ్చి ఉండొచ్చు. భయపడకండి’ అంటూ ఆశ్చర్యంగా చూస్తున్న అక్కడున్న ఉద్యోగులకు పాండే సమాధానమిచ్చింది. అనంతరం దాన్ని ఓ సంచిలో వేసుకుని తీసుకెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు ఆమెను ప్రశంసిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
I first thought she’s here to fix the HDMI cable that might have come loose 😭😭 pic.twitter.com/U3vt3o53R2
— Yo Yo Funny Singh (@moronhumor) July 27, 2024
Also Read..
Snakebite | దేశంలో పాముకాటుతో ఏటా 50 వేల మంది మృతి.. ప్రపంచంలోనే అత్యధికం : బీజేపీ ఎంపీ