ముంబై : మన దేశంలో ఎంతో ప్రసిద్ధి చెందిన కొల్హాపురి చెప్పుల (Kolhapuri Chappals) బ్రాండ్‌ను కాపీ కొట్టిన ఇటలీకి చెందిన ప్రాడా సంస్థ అదే తరహా చెప్పులను (Prada Chappals) తయారు చేసి అక్కడ రూ.70 నుంచి 90 వేలకు అమ్మడం ప్రారంభించింది. ఈ బ్రాండ్ తమదని, డిజైన్‌ను కాపీ కొట్టి అమ్మకాలు సాగించడం అన్యాయమని, తమకు కనీసం క్రెడిట్ కూడా ఇవ్వలేదని భారత్‌కు చెందిన పలువురు అభ్యంతరం చెప్పారు.
దీంతో తాము తయారు చేస్తున్న డిజైన్ భారత మూలాలకు చెందినదేనని అంగీకరించిన ప్రాడా, మీరు కూడా మా బ్రాండ్ పేరుతో భారత్‌లో అమ్మకాలు జరుపుకొమ్మని మహారాష్ట్ర ప్రభుత్వంతో గురువారం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు భారత్‌లో తొలుత 2 వేల జతలను ఒక జత రూ.84 వేల చొప్పున అమ్మాలని నిర్ణయించినట్టు సమాచారం.