హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ పాఠశాలలు, సంక్షే మ హాస్టళ్లు, గురుకుల విద్యార్థుల ప్రాణాలతో సర్కారు చెలగాటం ఆడుతున్నదని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి ఆగ్రహం వ్యక్తంచేశారు. వరుసగా చోటుచేసుకుంటున్న ఫుడ్‌పాయిజన్ ఘటనలపై ఆందోళన వ్యక్తంచేశారు. కలుషిత ఆహార ఘటనలను మానవహక్కుల ఉల్లంఘనగా పరిగణించాలని, వాటి పై తక్షణం విచారణ చేపట్టాలని కోరారు. రాష్ట్ర మానవ హకుల కమిషన్‌కు శనివారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ.. ఆర్టికల్ 21 ప్రకారం విద్యార్థులకు జీవన హకు, ఆరోగ్య హకు, గౌరవంతో జీవించే హకు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తుచేశారు. పాఠశాలల్లోనే కలుషిత ఆహారం వల్ల పిల్లల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు.
గురుకులంలో ఫుడ్ పాయిజన్ బాధ్యుల సస్పెన్షన్
సుల్తాన్‌బజార్, డిసెంబర్ 13: హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి మైనారిటీ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనకు సం బంధించి డిప్యూటీ వార్డెన్, ప్రిన్సిపాల్, ఇన్చార్జిని సస్పెండ్ చేశామని మంత్రి అజారుద్దీన్ చెప్పారు. కింగ్‌కోఠి దవాఖాన లో చికిత్సపొందుతున్న విద్యార్థులను శని వారం మంత్రి పరామర్శించారు. అనంత రం మీడియాతో మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యం మెరుగుపడుతున్నదని చెప్పారు.